అక్టోబర్‌లో పీజీఈసెట్‌ ఫలితాలు..

24 Sep, 2020 21:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సెప్టెంబర్‌ 21నుండి 24 వరకు జరిగిన టీఎస్‌పీజీఈసెట్‌ పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసినట్లు టీఎస్‌పీజీఈసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కుమార్ మొలుగారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, ఫార్మసీ  గ్రాడ్యుయేట్ స్థాయి ఫార్మ్-డి (పోస్ట్)లో రెగ్యులర్ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి టీఎస్‌పీజీసెట్‌ నిర్వహించినట్లు పేర్కొన్నారు. కాగా తెలంగాణలోని రెండు ప్రాంతాల్లో 19 సబ్జెక్టుల్లో ఈ పరీక్ష నిర్వహించారు.

అయితే అభ్యర్థులు 28 సెప్టెంబర్  2020 ప్రాథమిక కీతో మూల్యాంకనం చేసిన ఆన్సర్ షీట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఏమైనా అభ్యంతరాలుంటే 28 సెప్టెంబర్ 2020 నుండి 30 సెప్టెంబర్ 2020 వరకు http://pgecet.tsche.ac.in/ అభ్యర్థులు వెబ్‌సైట్‌లో సమర్పించవచ్చని తెలిపారు. అక్టోబర్ రెండో వారంలో ఫలితాలు http://pgecet.tsche.ac.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని  కుమార్ మొలుగారం పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు