‘గ్రానైట్‌ కుటుంబాన్ని విస్మరించను’

13 Jun, 2022 00:59 IST|Sakshi
హైదరాబాద్‌లో రవిచంద్ర, నామాలను సన్మానిస్తున్న గ్రానైట్‌ అసోసియేషన్‌ సభ్యులు  

ఖమ్మం మయూరిసెంటర్‌: తాను వ్యాపారంలో ఎద గడానికి, రాజకీయంగా రాణించడానికి దోహద పడిన గ్రానైట్‌ కుటుంబాన్ని జీవితంలో ఎన్నడూ విస్మరించబోనని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఏ పదవి లేకుండానే గ్రానైట్‌ పరిశ్రమకు ఎంతో చేశానని, ఇప్పుడు ఎంపీగా ఎన్నికైన తర్వాత ఈ పరిశ్రమను కాపాడుకోవడం లో ముందుంటానని చెప్పారు.

ఇటీవల రాజ్యసభ కు ఎన్నికైన రవిచంద్రను తెలంగాణ గ్రానైట్‌ పరి శ్రమ యజమానుల సంఘం ఆధ్వర్యంలో ఆది వారం హైదరాబాద్‌లో ఘనంగా సన్మానించారు. ఖమ్మం, కరీంనగర్, వరంగల్‌ జిల్లాల నుంచి వం దలాది మంది గ్రానైట్‌ యజమానులు ఈ కార్యక్ర మానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా అసోసి యేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శంకర్‌ అధ్యక్షతన జరిగిన సభలో రవిచంద్ర మాట్లాడుతూ.. గ్రానైట్‌ పరిశ్రమలో ఉన్న వాళ్లంతా తన కుటుంబ సభ్యులని అన్నారు.

వారికి ఏ కష్టం వచ్చినా కుటుంబ పెద్దగా ముందుంటానని హామీ ఇచ్చారు. టీఆర్‌ఎస్‌ లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ గ్రానైట్‌ కుటుంబం నుంచి ఇంత కాలం తానొక్కడినే ఎంపీగా ఉన్నానని, ఇప్పుడు రవిచంద్ర కూడా ఎన్నికవడం సంతోషకర మన్నారు. సభలో గ్రానైట్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు రాయల నాగేశ్వరరావు, సంఘం ప్రతినిధులు పాటిబండ్ల యుగంధర్, ఉప్పల వెంకటరమణ, గంగుల ప్రదీప్, రాయల నాగేశ్వర రావు, జిల్లా అశోక్, చక్రధర్‌రెడ్డి, శరాబందీ, కోటేశ్వరరావు, నరేందర్, వెంకట్రావు, ఫణి కుమార్, శ్రీధర్, రవీందర్‌రావు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు