టీచర్ల బదిలీల షెడ్యూల్‌ విడుదల.. లీక్‌పై డైరెక్టర్‌ సీరియస్‌

24 Jan, 2023 02:18 IST|Sakshi

27 నుంచి షురూ.. మార్చి 4న ముగింపు..

మార్చి 5 నుంచి 19వ తేదీ మధ్య అప్పీళ్ల స్వీకరణ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ సోమవారం అనధికారికంగా బయటకొచ్చింది. అందుబాటులోకి వచ్చిన షెడ్యూల్‌ ప్రకారం.. ఈ నెల 27 నుంచి మొదలయ్యే బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ మార్చి 4వ తేదీతో ముగియనుంది.   

షెడ్యూల్‌ ఇలా... 
జనవరి 27న అన్ని కేటగిరీల్లో ఖాళీలు, ప్రధానోపాధ్యాయుల పదోన్నతికి అర్హులైన స్కూల్‌ అసిస్టెంట్స్‌ సీనియారిటీ జాబితాలు ఆన్‌లైన్‌లో ప్రకటిస్తారు. 
28 నుంచి 30 వరకు బదిలీ దరఖాస్తులు ఆన్‌లైన్‌లో స్వీకరిస్తారు 
జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2 లోపు.. దరఖాస్తుల హార్డ్‌ కాపీలను హైసూ్కల్‌ ఉపాధ్యాయులు సంబంధిత ప్రధానోపాధ్యాయులకు, ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత ఉపాధ్యాయులు సంబంధిత ఎంఈఓలకు, మండల పరిషత్‌ పీఎస్, యూపీఎస్‌ ఉపాధ్యాయులు సంబంధిత కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులకు, హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయులు డీఈఓకు సమర్పించాలి 
ఫిబ్రవరి 3–6 తేదీల మధ్య దరఖాస్తుల హార్డ్‌ కాపీలను ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు డీఈఓ కార్యాలయంలో సమరి్పంచడం, పరిశీలన.. ఆన్‌లైన్‌లో ఆమోదం. 
7న డీఈఓ/ఆర్జేడీ వెబ్‌సైట్లలో బదిలీ పాయింట్లతో ప్రొవిజనల్‌ సీనియారిటీ, పదోన్నతుల సీనియారిటీ జాబితాలు ప్రకటిస్తారు.  
8 నుంచి 10 వరకు మూడురోజుల పాటు అభ్యంతరాల స్వీకరణ, పరిశీలన, పరిష్కారం జరుగుతుంది. 
11, 12 తేదీల్లో తుది సీనియారిటీ జాబితాల ప్రకటన, ప్రధానోపాధ్యాయుల బదిలీలకు వెబ్‌ ఆప్షన్ల నమోదు. 
13న మల్టీ జోనల్‌ స్థాయిలో ప్రధానోపాధ్యాయులు వెబ్‌ ఆప్షన్ల ఎడిటింగ్, పునఃపరిశీలన చేసుకోవచ్చు. 
14న ఆర్జేడీలు ప్రధానోపాధ్యాయుల బదిలీ ఉత్తర్వులు విడుదల. 
15న బదిలీల అనంతరం మిగిలిన  ఖాళీల ప్రకటన. 

16, 17, 18 తేదీల్లో అర్హత ఉన్న స్కూల్‌ అసిస్టెంట్లకు ప్రభుత్వ, జిల్లా పరిషత్‌ యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పదోన్నతుల కౌన్సెలింగ్‌ జరుగుతుంది.
19, 20 తేదీల్లో సబ్జెక్ట్‌ వారీగా స్కూల్‌ అసిస్టెంట్స్‌ ఖాళీల ప్రకటన, బదిలీ ఆప్షన్స్‌ నమోదు.
21న ఆప్షన్ల సవరణ, పునఃపరిశీలనకు అవకాశం.
22, 23 తేదీల్లో డీఈఓలచే స్కూల్‌ అసిస్టెంట్స్‌ బదిలీ ఉత్తర్వులు విడుదల.
24న స్కూల్‌ అసిస్టెంట్ల బదిలీల అనంతరం ఏర్పడిన ఖాళీల ప్రకటన.
25, 26, 27 తేదీల్లో ఎస్జీటీ తత్సమాన కేటగిరీ ఉపాధ్యాయులకు (కోర్టు కేసులు లేని సబ్జెక్టులకు) మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ ద్వారా స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులు.
ఫిబ్రవరి 28, మార్చి 1, 2 తేదీల్లో ఎస్జీటీ తత్సమాన పోస్టుల ఖాళీల ప్రకటన, వెబ్‌ ఆప్షన్ల నమోదు. ∙3న ఆప్షన్ల సవరణ, పునఃపరిశీలన.
4న ఎస్జీటీ తత్సమాన కేటగిరీ ఉపాధ్యాయులకు బదిలీ ఉత్తర్వులు విడుదల.
5 నుండి 19 వరకు డీఈఓలు ఇచ్చిన బదిలీ ఉత్తర్వులపై అప్పీళ్లు, అభ్యంతరాలను ఆర్జేడీకి, ఆర్జేడీ ఉత్తర్వులపై అప్పీళ్లు/అభ్యంతరాలను పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌కు పంపవచ్చు. 
డైరెక్టర్‌ ఆగ్రహం:
టీచర్ల బదిలీల షెడ్యూల్‌ బయటకు రావడంపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ దేవసేన ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం జరిగిన డీఈవోల సమావేశంలో విద్యా శాఖ బదిలీల షెడ్యూల్‌పై చర్చించారు. సమావేశం జరుగు తుండగానే షెడ్యూల్‌ లీకయ్యింది. ఈ నేపథ్యంలో డీఈవోల ఫోన్లు స్వా«దీనం చేసుకుని పరిశీలించినట్లు తెలిసింది.   

మరిన్ని వార్తలు