తెలంగాణలో ప్రారంభమైన టెట్‌ పరీక్ష

15 Sep, 2023 09:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) ప్రారంభమైంది. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షా హల్స్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది పాఠశాల విద్యాశాఖ.  

రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన మొత్తం 1,139 పరీక్ష కేంద్రాల్లో ఉదయ, మధ్యాహ్నం రెండు సెషన్లలో టెట్‌ పేపర్‌–1, పేపర్‌–2 జరుగుతుంది.
 ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే పేపర్‌–1 పరీక్షకు 1,139 కేంద్రాలు ఏర్పాటు చేయ గా, 2,69,557 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. 
► మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే పేపర్‌–2 పరీక్షకు 913 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా, 2,08,498 మంది అభ్యర్థులు హాజరవుతారు. 

పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేసిన విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సెలవు ప్రకటించింది. వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచిన అధికారులు, వాటిలో పొరపాట్లు తలెత్తితే సరిచేసుకునే సూచనలు సైతం వెల్లడించారు. 

సీసీ కెమెరాల పర్యవేక్షణలో...
టెట్‌ జరిగే కేంద్రాల్లో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల ద్వారా పరీక్ష తీరును పర్యవేక్షిస్తారు.  పరీక్ష సమయం పూర్తయ్యాకే అభ్యర్థులను కేంద్రం నుంచి బయటకు పంపిస్తారు.

మరిన్ని వార్తలు