TS TET Results 2022: టెట్‌ ఫలితాలు విడుదల

1 Jul, 2022 11:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET) ఫలితాలు విడుదలయ్యాయి. శుక‍్రవారం ఉదయం 11.30 గంటలకు ఫలితాలను అధికారులు వెల్లడించారు. టెట్‌ ఫలితాలను సాక్షిఎడ్యుకేషన్‌.కామ్‌ (https://results.sakshieducation.com/)లింక్‌ క్లిక్‌ చేసి చూడవచ్చు. 

- టెట్ పేపర్-1లో 1,04,078 మంది అభ్యర్థులు అర్హత, 32.68% ఉత్తీర్ణత సాధించారు.

- టెట్ పేపర్-2లో 1,24,535 మంది అర్హత, 49.64 % ఉత్తీర్ణత సాధించారు.

కాగా, ఇప్పటికే టెట్‌ ఫైనల్‌ కీని టెట్ కన్వీనర్ రాధారెడ్డి విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక, జూన్‌ 12న నిర‍్వహించిన టెట్‌ పరీక్ష పేపర్‌-1కు 3,18,506, పేపర్‌-2కు 2,51,070 మంది అభ‍్యర్థులు హాజరయ్యారు. 

మరిన్ని వార్తలు