టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ, హైదరాబాద్‌లో 151 అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పోస్టులు

8 Jul, 2021 12:18 IST|Sakshi

హైదరాబాద్‌లోని లక్డీకపూల్‌లో ఉన్న తెలంగాణ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌(టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ).. అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌(ఏపీపీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 151(మల్టీ జోన్‌–1–68, మల్టీ జోన్‌–2–83).
► అర్హత: ఏదైనా సబ్జెక్టులో బ్యాచిలర్‌ డిగ్రీతోపాటు బ్యాచిలర్స్‌ డిగ్రీ ఇన్‌ లా (ఎల్‌ఎల్‌బీ/బీఎల్‌)/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. ఇంటర్మీడియట్‌ తర్వాత ఐదేళ్ల లా కోర్సు ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 04.07.2021 నాటికి అభ్యర్థులు రాష్ట్రంలోని ఏదైనా క్రిమినల్‌ కోర్టులో మూడేళ్లకు తగ్గకుండా.. అడ్వకేట్‌గా ప్రాక్టీస్‌ చేస్తుండాలి. శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి.

► వయసు: 01.07.2021 నాటికి 34 ఏళ్లు మించకూడదు. 
► వేతనం: నెలకు రూ.54,220 నుంచి 1,33,630 చెల్లిస్తారు.
► ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.

► పరీక్షా విధానం: ఈ పరీక్షను మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో పేపర్‌–1, 100 మార్కులకు(200 ప్రశ్నలు), పేపర్‌–2, 100 మార్కులకు ఉంటుంది. పేపర్‌–1 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నల రూపంలో.. పేపర్‌–2 డిస్క్రిప్టివ్‌ పద్ధతిలో ఉంటుంది. ప్రతి పేపర్‌కు పరీక్ష సమయం 3 గంటలు. రెండు పేపర్లకు సంబంధించిన ఈ పరీక్షను ఇంగ్లిష్‌ మీడియంలో నిర్వహిస్తారు. పేపర్‌–1లో అర్హులైన అభ్యర్థులకు మాత్రమే పేపర్‌–2 మూల్యాంకనం చేస్తారు.

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది:31.07.2021
► వెబ్‌సైట్‌: https://www.tslprb.in

మరిన్ని వార్తలు