TS: ఎస్సై, కానిస్టేబుల్ తుది రాతపరీక్ష ఫలితాలు విడుదల

30 May, 2023 18:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో పోలీస్‌ నియామక తుది రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఎస్ఐ, కానిస్టేబుల్ తుది రాత పరీక్షల్లో 84 శాతం మంది అర్హత సాధించినట్లు పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు మంగళవారం ప్రకటించింది.  కానిస్టేబుల్‌ సివిల్‌, ట్రాన్స్‌పోర్టు, ఎక్సైజ్‌ పోస్టులకు 98,218 మంది, కానిస్టేబుల్‌ ఐటీ అండ్ కమ్యునికేషన్‌కు 4,564మంది అభ్యర్థులు ఎంపికయ్యారు.

సివిల్‌ ఎస్సై 43,708 మంది, ఐటీ అండ్ కమ్యునికేషన్‌ ఎస్సై  పోస్టులకు 729 మంది, డ్రైవర్, ఆపరేటర్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు 1,779 మంది, ఫింగర్‌ ఫ్రింట్‌ బ్యూరో ఏఎస్సై పోస్టులకు 1,153 మంది, పోలీస్‌ ట్రాన్స్‌పోర్టు ఎస్సై పోస్టులకు 463 మంది, పోలీస్‌ కానిస్టేబుల్‌ మెకానిక్‌కు 283 మంది ఎంపికయినట్టు రిక్రూట్‌మెంట్‌ బోర్డు తెలిపింది. మంగళవారం రాత్రి నుంచి అభ్యర్ధులు సాధించిన మర్కుల వివరాలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని రిక్రూట్‌మెంట్‌ బోర్డు తెలిపింది.

ఫైనల్‌ కీ, ఓఎంఆర్‌ షీట్లు వెబ్‌ సైట్‌లో తమ వ్యక్తిగత లాగిన్‌లో చూసుకోవచ్చని పేర్కొంది.  రీకౌంటింగ్, రీ వెరిఫికేష‌న్‌కు అవకాశం క‌ల్పించారు. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్య‌ర్థులు రూ. 2 వేలు, ఇత‌ర క‌మ్యూనిటీలు, నాన్ లోకల్ అభ్య‌ర్థులు రూ. 3 వేలు చెల్లించి రీ కౌంటింగ్, రీవెరిఫికేష‌న్ చేసుకోవ‌చ్చ‌ని సూచించారు. రీ కౌంటింగ్, రీ వెరిఫికేష‌న్ ప్ర‌క్రియ జూన్ 1వ తేదీ ఉద‌యం 8 గంట‌ల నుంచి జూన్ 3వ తేదీ రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.
చదవండి: ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో మరోసారి కవిత పేరు..

మరిన్ని వార్తలు