గ్రూప్‌–4లో మరో 141 పోస్టులు

29 Jan, 2023 04:02 IST|Sakshi

టీఎస్‌పీఎస్సీ అనుబంధ ప్రకటన  

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్‌–4 కొలువులు మరి­న్ని పెరిగాయి. వివిధ ప్రభుత్వ శాఖల్లో 8,039 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసిన తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తోంది. తా­జా­గా గ్రూప్‌–4 కేటగిరీలో మరో 141 పోస్టుల­ను జత చేస్తూ అనుబంధ ప్రకటనను శనివా­రం విడుదల చేసింది. దీంతో గ్రూప్‌–4 కేటగి­రీలో పోస్టుల సంఖ్య 8,180కు చేరింది.

తాజా­గా ప్రకటించిన 141 పోస్టులు మహాత్మా జ్యో­తిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీకి సంబంధించిన ఖాళీలు. ఇందులో బాలుర గురుకుల విద్యాసంస్థలకు సంబంధించి 86 పోస్టులుండగా, బాలికల విద్యా సంస్థలకు సంబంధించి 55 పోస్టులున్నాయి. అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.   

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు