TSPSC Group 2 Notification 2022: గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ రిలీజ్‌.. పోస్టులు, అప్లై తేదీల వివరాలు ఇవే..

30 Dec, 2022 01:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో కీలకమైన గ్రూప్‌–2 ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ గురువారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. 18 శాఖల్లో 783 ఉద్యోగాల భర్తీకి ఈ ప్రకటన విడుదలైంది. 2023 జనవరి 18 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. ఫిబ్రవరి 16 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగనుంది.

అభ్యర్థుల విద్యార్హతలు, వయోపరిమితి తదితర వివరాలను కమిషన్‌ వెబ్‌సైట్‌లో చూడాలని టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. ఈ ఉద్యోగ ఖాళీల్లో అత్యధికంగా సాధారణ పరిపాలన విభాగం పరిధిలో 165 అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ పోస్టులున్నాయి. ఆ తర్వాత పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో 126 మండల్‌ పంచాయత్‌ ఆఫీసర్‌ పోస్టులు, భూ పరిపాలన శాఖలో 98 నయాబ్‌ తహసీల్దార్‌ పోస్టులున్నాయి.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత రెండోసారి భర్తీ చేస్తున్న గ్రూప్‌–2 పోస్టుల్లో పెద్ద సంఖ్యలో ఖాళీలుండటంతో నిరుద్యోగ అభ్యర్థులు పెద్ద ఎత్తున కసరత్తు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే గ్రూప్‌–1, గ్రూప్‌–4 కేటగిరీలతోపాటు పలు విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసిన టీఎస్‌పీఎస్సీ... అతిత్వరలో గ్రూప్‌–3 ప్రకటన విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.  మరిన్ని వివరాల కోసం సాక్షి ఎడ్యుకేషన్‌ వెబ్‌సైట్‌ను క్లిక్‌ చేయగలరు. 

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు