ఏఎంవీఐ నోటిఫికేషన్‌ ఉపసంహరణ

4 Sep, 2022 01:30 IST|Sakshi

సాక్షి,హైదరాబాద్‌: రవాణాశాఖలో అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ కొలువుల భర్తీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) జూలైలో విడుదల చేసిన నోటిఫికేషన్‌ను శనివారం ఉపసంహరించుకుంది.

నోటి ఫికేషన్‌ వెలువడిన నాటికి అభ్యర్థులకు తప్పకుండా హెవీ మోటార్‌ వెహికల్‌ లైసెన్స్‌ ఉండాలన్న నిబంధనపై నిరుద్యోగుల నుంచి పెద్ద సంఖ్యలో వినతులు వచ్చాయి. అర్హతలపై మరోమారు పరిశీలించాలని అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరడంతో నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ ఉపసంహరించుకుంది.

మరిన్ని వార్తలు