ఆర్టీసీకి ఆయిల్‌ చిక్కులు

29 Sep, 2020 05:28 IST|Sakshi

రూ.70 కోట్ల మేర పేరుకున్న బకాయిలు

డీజిల్‌ సరఫరా నిలిపివేతకు కంపెనీల హెచ్చరిక

టికెట్‌ ఆదాయం పెంచుకునేందుకు ఆర్టీసీ యత్నం

సిటీ సర్వీసులతో రూ.4.5 కోట్లకు చేరుకున్న రోజువారీ ఆదాయం

తొలిసారి రవాణా సంస్థలో చమురు సమస్య

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీకి చమురు సమస్య నెలకొంది. ప్రస్తుతం ఆదాయం చాలా తక్కువగా ఉండటంతో రెండు నెలలుగా చమురు సంస్థలకు డీజిల్‌ తాలూకు పూర్తి బిల్లులు చెల్లించలేక పోతోం ది. దీంతో దాదాపు రూ.70 కోట్ల వరకు బకాయిలు ఏర్పడ్డాయి. ఇంతపెద్ద మొత్తంలో బకాయిలు పేరుకుపోవడంతో చమురు సంస్థలు బిల్లుల కోసం ఒత్తిడి చేస్తున్నాయి. ఈ మొత్తాన్ని ఒకేసారి చెల్లించే పరిస్థితి లేకపోవడంతో చమురు సర ఫరాను నిలిపేయనున్నట్లు ఆ సంస్థలు హెచ్చరిం చాయి. ఒకట్రెండు రోజులు నిలిపేశాయి కూడా. దీంతో ఆర్టీసీలో ఆందోళన మొదలైంది. చమురు సంస్థల ప్రతినిధులతో చర్చించి కొంతమేర చెల్లిం చేందుకు సిద్ధమయ్యింది. దీంతో తాత్కాలి కంగా సరఫరాను ఆయా సంస్థలు పునరుద్ధరిం చాయి. పక్షం రోజుల్లో బిల్లులు చెల్లించే హామీతో సరఫరా ను పునరుద్ధరించినట్లు తెలిసింది. ఆలోగా డబ్బు లు చెల్లించకుంటే డీజిల్‌ సరఫరాను ఆపేయను న్నట్టు ఆయిల్‌ కంపెనీలు హెచ్చరించాయి. 

4.5 కోట్లకు చేరుకున్న ఆదాయం..
లాక్‌డౌన్‌తో బస్సు సర్వీసులు నిలిచిపోవటంతో ఆర్టీసీకి ఆదాయం లేకుండా పోయింది. దాదాపు రెండున్నర నెలలు చిల్లిగవ్వ ఆదాయం లేదు. మే చివరలో జిల్లా బస్సు సర్వీసులు మొదలైనా కరో నా కేసుల తీవ్రత కారణంగా జనం బస్సులెక్కేం దుకు భయపడ్డారు. ఆక్యుపెన్సీ రేషియో 25 శాతంగా ఉండటంతో నామమాత్రపు ఆదాయంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గత పక్షం రోజులుగా ప్రయాణికుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ఆక్యుపెన్సీ రేషియో 55 శాతానికి చేరడంతో రోజువారీ ఆదాయం రూ.4 కోట్లను మించుతోంది. మూడు రోజుల క్రితం సిటీ బస్సులు ప్రారంభమయినా.. పావు శాతమే తిరుగుతుండటంతో రూ.30 లక్షల ఆదాయం ఉంటోంది. కార్గో బస్సుల రూపంలో రూ.10 లక్షల అదనపు ఆదాయం సమకూరుతోంది. ఇవి తప్ప ఆర్టీసీ వద్ద వేరే నిధులు లేకపోవటంతో చమురు » కాయిలు తీర్చేందుకు ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. 

2.6 కోట్ల లీటర్ల చమురు ఖర్చు...
ప్రస్తుతం ఆర్టీసీ నిత్యం 16.6 లక్షల కిలోమీటర్ల మేర బస్సులను తిప్పుతోంది. దీనికి 2.6 కోట్ల లీటర్ల చమురు ఖర్చవుతోంది. గతంలో ఎప్పటి కప్పుడు బిల్లులు చెల్లించే పద్ధతి ఉండేది. ఇప్పుడు రోజుకు కొంతమేర మాత్రమే చెల్లిస్తున్నా రు. దీంతో ఎక్కువ మొత్తం పేరుకుపోతూ రూ.70 కోట్లకు బకాయి చేరుకుంది. ఆర్టీసీకి ఇతర ఆదా యం లేకపోవటంతో చమురు కంపెనీలు కూడా ఆలోచనలో పడ్డాయి. గతంలో ఎప్పుడూ లేనట్టు ఒత్తిడి పెంచి, ఆర్టీసీ చరిత్రలో తొలిసారి చమురు సరఫరాను నిలిపివేయటంలాంటి సీరియస్‌ నిర్ణ యం తీసుకున్నాయి. ఈ కారణంగానే ఆదాయం పెంపునకు సిటీలో ఆగమేఘాల మీద బస్సు సర్వీ సులు ప్రారంభించాల్సి వచ్చింది. క్రమంగా వీటి సంఖ్యను పెంచుతూ ఆదాయాన్ని పెంచుకు నేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

దయతో వ్యవహరించండి..
లాక్‌డౌన్‌ వేళ సర్వీసులు పూర్తిగా నిలిచిపోవటంతో ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో బిల్లులు చెల్లించలేదని చమురు సరఫరా నిలిపివేసేలా ఆ సంస్థలు వ్యవహరించటం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చమురు కంపెనీలకు అతిపెద్ద వినియోగదారు ఆర్టీసీనే. నిత్యం లక్షల లీటర్ల డీజిల్‌ వినియోగించే ఆర్టీసీ విషయంలో కంపెనీలు ఆచితూచి వ్యవహరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటీవల స్వయంగా ఆర్టీసీ సొంతంగా పెట్రోలు బంకులు స్థాపించి చమురు కంపెనీలకు డీలర్‌గా మారిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రజా సేవలో ఉండే ఆర్టీసీ విషయంలో కంపెనీలు దయతో వ్యవహరించాలని పేర్కొంటున్నారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా