ఇంటికెళ్లి.. మామిడిపండ్లు అందించి..

11 May, 2022 01:30 IST|Sakshi
మామిడి పండ్లను అందజేస్తున్న సజ్జనార్‌  

పార్సిల్‌ అందజేసిన టీఎస్‌ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌

నిజాంపేట్‌: విశ్వసనీయతకు మారుపేరైన టీఎస్‌ ఆర్టీసీ కార్గో మ్యాంగో ఎక్స్‌ప్రెస్‌ ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోందని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ఆధ్వర్యంలో కార్గో మ్యాంగో ఎక్స్‌ప్రెస్‌ సేవలను మంగళవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా మొట్టమొదటి మ్యాంగో ప్యాకెట్‌ను బాచుపల్లి కౌసల్య కాలనీలోని ఎన్‌జేఆర్‌ సుఖీ–9లో నివాసముంటున్న మల్లిపూడి కిరణ్‌రాజ్, హేమలత దంపతుల గృహానికి సజ్జనార్‌ స్వయంగా వెళ్లి అందజేశారు.

ఈ సందర్భంగా సజ్జనార్‌ మాట్లాడుతూ ఆర్టీసీ ప్రారంభించిన కార్గో మ్యాంగో ఎక్స్‌ప్రెస్‌ ద్వారా ప్రసిద్ధి చెందిన జగిత్యాల బంగినపల్లి మామిడి పండ్లను అందిస్తున్నామని, కొనుగోలు దారులు 5 కిలోలకు తక్కువ కాకుండా ఆన్‌లైన్‌ (tsrtcparcel.in)లో బుక్‌ చేసుకుంటే 4 రోజుల్లో అందజేస్తామని తెలిపారు. ఇప్పటికే కార్గో మ్యాంగో ఎక్స్‌ప్రెస్‌లో 12 వేల మంది మామిడి పండ్లను బుక్‌ చేసుకున్నారని చెప్పారు. 

మరిన్ని వార్తలు