ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు కనీస వేతనాల సవరణ

20 Oct, 2021 03:24 IST|Sakshi

ఆదేశాలు జారీ చేసిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు కనీస వేతనాల ప్రకారం చెల్లింపులను ఆర్టీసీ ఖరారు చేసింది. తాత్కాలిక ఉద్యోగులందరికీ కనీస వేతనాలను అమలు చేయాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు అప్పటి పరిస్థితులకనుగుణంగా కార్మికశాఖ ఈ కనీస వేతనాలను సవరిస్తుంటుంది. కొంతకాలంగా ఆర్థిక పరిస్థితి బాగోలేదన్న కారణం చూపుతూ ఆర్టీసీ కనీసవేతనాలను సవరించటం లేదు. తాజాగా వాటిని సవరిస్తూ ప్రస్తుతం అమలులో ఉన్న స్థాయిలో వాటిని పెంచుతూ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రస్తుతం ఆర్టీసీలో వివిధ కేటగిరీలకు సంబంధించి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు 2,700 మంది ఉన్నారు. వీరందరికీ నవంబరు నుంచి కొత్త వేతనాలు అందనున్నాయి. సఫాయీ కర్మచారీ విభాగానికి సంబంధించి జోన్‌–1లో రూ.12,059గా ఉన్న మొత్తాన్ని రూ.13,952కు, జోన్‌–2లో రూ.11,799 నుంచి రూ.13,692కు, జోన్‌–3లో రూ.11,599 నుంచి రూ.13,492కు పెంచారు.

సెక్యూరిటీ విభాగంలో ఇన్‌స్పెక్టర్లకు ఇవే జోన్‌ల పరిధిలో వరుసగా రూ.11,772–రూ.13,284,10,772–12,284, రూ.9,522–రూ.11,034, సెక్యూరిటీ గార్డుకు రూ.10,272–రూ.11,784, రూ.9,522–రూ.11,034, రూ.9,272–రూ.10,784, కాంట్రాక్టు కార్మికులకు సంబంధించి అన్‌స్కిల్డ్‌ రూ.9,011–రూ.10,478, సెమీ స్కిల్డ్‌ రూ.10,640–రూ.12,376,స్కిల్డ్‌ రూ.13,057–రూ.15,185, డాటా ఎంట్రీ ఆప రేటర్లు రూ.9,826–రూ.11,427, అటెండర్లు రూ.9,011–రూ.10,478గా ఖరారు చేశారు 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు