గుట్కా నములుతూ స్టీరింగ్‌ తిప్పితే మూడినట్టే

2 Nov, 2021 01:11 IST|Sakshi

ఆర్టీసీ డ్రైవర్లకు ఎండీ హెచ్చరిక 

సాక్షి, హైదరాబాద్‌:  ‘ఆర్టీసీ డ్రైవర్‌ సంస్థకు ఫ్రంట్‌ లైన్‌ వర్కర్‌. అతను పద్ధతిగా ఉండాలి. డ్రైవింగ్‌ సమయంలో గుట్కా, ఇతర పొగాకు పదార్థాలు నములుతూ ఉమ్ముతూ బస్సును అపరిశుభ్రంగా మార్చి, వెనక వచ్చేవారికి అసౌకర్యం కలిగిస్తే సహించేది లేదు. వారిపై చర్యలు తప్పవు’ అంటూ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తాజాగా హెచ్చరించా రు. వెంటనే దీన్ని అమలులోకి తేవాలని ఆదేశాలిచ్చారు. ఎవరైనా పాటించనట్టు తేలితే చర్యలు తీసుకోవాలంటూ సర్క్యులర్‌ జారీ చేశారు. 

ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు... 
ఆర్టీసీ డ్రైవర్లలో కొందరికి గుట్కా/ ఇతర పొగాకు పదార్ధాలు నమలటం అలవాటు ఉంది. అవి నమి లి బస్సులోపలే ఉమ్మేస్తున్నారు. ఇది బస్సు అంతటా దుర్వాసనకు కారణమవుతోంది. కొందరు బయటకు ఉమ్మినప్పుడు తుంపర్లు ఇతరులపై పడి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి ఫిర్యాదులను ఎండీ సజ్జనార్‌ తీవ్రంగా పరిగణించారు. ఈ మేరకు ఈడీలు, ఆర్‌ఎంలు, డీవీఎంలు, డీఎంలకు ఆదేశాలు జారీ చేశారు. 

హెచ్చరిక, ఇంక్రిమెంట్‌కట్, సస్పెన్షన్‌!  
డిపోల్లో నిత్యం జరిగే గేట్‌ మీటింగ్స్‌లో ఈ విషయమై డ్రైవర్లలో అవగాహన కల్పించాలన్నారు. తరచూ తనిఖీలు చేస్తూ, డ్రైవింగ్‌ సమయంలో గుట్కా/ఇతర పొగాకు పదార్థాలు నములుతున్న వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. అ యితే, క్రమశిక్షణా చర్యల్లో ఇంకొంచెం స్పష్టత రా వాల్సి ఉంది. మొదటిసారి హెచ్చరిక, రెండోసారి ఇంక్రిమెంట్‌ కట్, మూడోసారికి సస్పెన్షన్‌ వంటి చర్యలు తీసుకోనున్నట్టు సమాచారం.   

మరిన్ని వార్తలు