భక్తుల వద్దకే మేడారం బస్సులు: సజ్జనార్‌

5 Feb, 2022 21:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం 51 ప్రాంతాల నుంచి 3,845 బస్సులు నడుపుతున్నట్టు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ వెల్లడించారు. ఈ బస్సులు అమ్మవారి గద్దెలకు చేరువగా వెళతాయని చెప్పారు. భక్తులు ప్రైవేటు వాహనాల్లో వెళ్లి ఐదారు కిలోమీటర్ల దూరంలో వాటిని నిలిపి ఇబ్బంది పడాల్సి ఉంటుందని గుర్తు చేశారు. మేడారం జాతర నేపథ్యంలో శుక్రవారం ఆయన బస్‌భవన్‌లో మీడియాతో మాట్లాడారు.

చదవండి: మేడారంలో ‘గుడిమెలిగె’

30 మంది భక్తులు ఒకేచోట ఉంటే.. వారి చెంతకే బస్సును పంపుతామని, కావాల్సిన వారు 040–30102829 నంబర్‌కు ఫోన్‌ చేయాలన్నారు. మేడారంలో 50 ఎకరాల్లో బేస్‌ క్యాంపు, తాత్కాలిక బస్టాండ్, క్యూలైన్లు, స్వచ్ఛమైన తాగునీరు, పరిశుభ్రమైన టాయిలెట్ల వసతి  ఏర్పాటు చేశామని వివరించారు. మేడారం జాతర వివరాలు, బస్సుల సమగ్ర సమాచారం, సమీపంలో ఉండేందుకు హోటల్‌ వసతి, చార్జీలు, ఇతర విభాగాల వివరాలతో.. కిట్స్‌ కళాశాల విద్యార్థులు రూపొందించిన ప్రత్యేక యాప్‌ను ప్రారంభించారు.

మరిన్ని వార్తలు