TSRTC: జలపాతాల సందర్శనకు ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజ్‌ టూర్‌

21 Oct, 2022 20:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులకు శుభవార్త. జలపాతాల సందర్శనకు తెలంగాణ ఆర్టీసీ ప్రతి శని, ఆదివారాల్లో బస్సులు నడపాలని నిర్ణయించింది. ఆదిలాబాద్‌లోని కుంటాల జలపాతాన్ని సందర్శించేందుకు ఈ సర్వీసులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ సికింద్రాబాద్‌ రీజనల్‌ మేనేజర్‌ వెంకన్న ఒక ప్రకటనలో తెలిపారు. 


ఈప్రత్యేక బస్సులు ప్రతి శని, ఆదివారాల్లో ఉదయం 5 గంటలకు మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌ (ప్లాట్‌ఫామ్‌ 55, 56) నుంచి, ఉదయం 5.30 గంటలకు జూబ్లీ బస్‌స్టేషన్‌ (ప్లాట్‌ఫామ్‌ 20) నుంచి బయల్దేరుతాయి. 


పర్యటనలో భాగంగా పోచంపాడ్‌ శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు, పోచేరా జలపాతం సందర్శిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆదిలాబాద్‌లోని కుంటాల జలపాతాన్ని, అనంతరం నిర్మల్‌ బొమ్మలు, హస్తకళలను సందర్శిస్తారు. రాత్రి 10.45 గంటలకు తిరిగి నగరానికి చేరుకుంటారు. (క్లిక్‌: ఆర్టీసీ ‘హైదరాబాద్‌ దర్శిని’.. వీకెండ్‌లో స్పెషల్‌ సర్వీసులు)


ఈ పర్యటనలో కుంటాల వద్ద మధ్యాహ్న భోజనం, తిరుగు ప్రయాణంలో చేగుంట వద్ద రాత్రి భోజన సదుపాయం ఉంటుంది. పిల్లలకు రూ.599, పెద్దవాళ్లకు రూ.1099 చొప్పున చార్జి ఉంటుంది. పర్యటన టిక్కెట్ల బుకింగ్‌ కోసం ఫోన్‌ : 7382842582 నంబర్‌ను సంప్రదించవచ్చు. (క్లిక్‌: పెద్ద జబ్బులకు ఉచితంగా పీహెచ్‌సీల్లో చికిత్స)

మరిన్ని వార్తలు