టీటీడబ్ల్యూఆర్‌డీసీఎస్‌లో పార్ట్‌టైం టీచింగ్‌ పోస్టులు

19 May, 2021 20:17 IST|Sakshi

హైదరాబాద్‌లోని తెలంగాణ ట్రైబల్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌కి చెందిన సిరిసిల్ల జిల్లాలోని తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ డిగ్రీ కాలేజ్‌(టీటీడబ్ల్యూర్‌డీసీఎస్‌)లో తాత్కాలిక ప్రాతిపదికన వివిధ సబ్జెక్టుల్లో పార్ట్‌టైం గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► డైరెక్టర్‌ హానరరీ: అర్హత: మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌/పీహెచ్‌డీతో సమానమైన డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో ఐదేళ్ల అనుభవం ఉండాలి. వేతనం నెలకు రూ.60,000 చెల్లిస్తారు.

► పార్ట్‌టైం ఫ్యాకల్టీ ఇన్‌ ఫ్యాషన్‌ డిజైన్‌: అర్హత: ఫ్యాషన్‌ డిజైన్‌/ఫ్యాషన్‌ టెక్నాలజీలో బ్యాచిలర్స్‌/మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. వేతనం నెలకు రూ.30,000 చెల్లిస్తారు.

► పార్ట్‌టైం ఫ్యాకల్టీ ఇన్‌ ఇంటీరియర్‌ డిజైన్‌: అర్హత: ఇంటీరియర్‌ డిజైన్‌/తత్సమాన సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌/మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. వేతనం నెలకు రూ.30,000 చెల్లిస్తారు.

► పార్ట్‌టైం ఫ్యాకల్టీ ఇన్‌ ఫోటోగ్రఫీ: అర్హత: ఫోటోగ్రఫీ/తత్సమాన సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌/మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. వేతనం నెలకు రూ.30,000 చెల్లిస్తారు.

► పార్ట్‌టైం ఫ్యాకల్టీ ఇన్‌ కంప్యూటర్‌ సైన్స్‌: అర్హత: ఎంసీఏ/ఎంటెక్‌(సీఎస్‌ఈ/ఐటీ) తత్సమాన డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. వేతనం నెలకు రూ.30,000 చెల్లిస్తారు.

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 31.05.2021
► వెబ్‌సైట్‌: www.ttwrdcs.ac.in

మరిన్ని నోటిఫికేషన్లు:
ఆర్‌సీబీలో టెక్నికల్‌ కొలువులు

డీఎస్‌ఎస్‌ఎస్‌బీలో 7236 ఉద్యోగాలు

మరిన్ని వార్తలు