రోడ్డు ప్రమాదంలో టీవీ సీరియల్‌ నటుడి మృతి

21 May, 2023 11:20 IST|Sakshi
బాలు(ఫైల్‌)

ఏటూరు నాగారం(ములుగు జిల్లా): ఏటూరునాగారం మండలం రొయ్యూర్‌ గ్రామానికి  చెందిన కుమ్మరి బాలు(32) బుల్లితెర నటుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. రొయ్యూర్‌ గ్రామానికి చెందిన బాలుకు ఎవరు లేకపోవడంతో హైదరాబాద్‌లో స్థిరపడ్డారు.

టీవీ సీరియల్స్‌లో చిన్న పాత్రంల్లో నటిస్తూ జీవితాన్ని సాగిస్తున్నాడు. ఈనెల 18న కన్నాయిగూడెం మండలం దేవాదుల గ్రామానికి చెందిన తన స్నేహితుడి వివాహానికి బైక్‌పై హైదరాబాద్‌ నుంచి వచ్చారు.

వివాహం అనంతరం ఈనెల 19 అర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్‌కు బైక్‌పై వెళ్తుండా యాదాద్రి సమీపంలో బైక్‌ అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టింది. ఈ ఘటనలో బాలు అక్కడికక్కడే మృతి చెందాడు. బాలు బుల్లితెరలో నటిస్తూ ఇప్పుడిప్పుడే ఎదుగుతుండగా విధి వక్రించి ఈ కానరాని లోకాలకు తీసుకెళ్లిందని స్నేహితులు, గ్రామస్తులు వాపోతున్నారు. మృతుడికి భార్య ఉంది.
చదవండి: అందులో నిజం లేదు, ఆ రూమర్స్‌ నన్నెంతో బాధపెట్టాయి: తమన్నా

మరిన్ని వార్తలు