అర్జున్‌రెడ్డి, తరుణ్‌రెడ్డి.. వీళ్లిద్దరూ మామూళ్లోలు కాదండోయ్!

2 May, 2022 21:00 IST|Sakshi

సాక్షి,దుండిగల్‌: వారు పిల్లలు కాదు.. చిచ్చర పిడుగులు.. ఒక్కసారి ఆటలోకి దిగితే వార్‌ వన్‌ సైడ్‌ కావాల్సిందే. ప్రత్యర్థుల అంచనాలను తలకిందులు చేయడంలో ఈ అన్నదమ్ములు దిట్ట. చెస్‌ ఆటలో ఎదుటివారి ఎత్తులకు పైఎత్తులు వేస్తూ చిత్తు చేయడంలో వీరు దిట్ట. ఈ సోదరుల ఆట తీరును చూసిన వారు సంభ్రమాశ్చర్యాలకు లోనవుతారనడంలో అతిశయోక్తి లేదు. రాష్ట్ర స్థాయిలోనే కాదు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఇప్పటికే ఎన్నో సంచలన విజయాలు తమ ఖాతాలో వేసుకుని పతకాలు సాధించిన పన్నేండేళ్ల అర్జున్‌రెడ్డి, పదహారేళ్ల తరుణ్‌రెడ్డి అన్నతమ్ముళ్లపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. 

కుటుంబ నేపథ్యం.. 
►  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విశాఖపట్నంకు చెందిన ఆదిరెడ్డి సత్యత్రినాథ్‌ కొన్నేళ్ల క్రితం కుటుంబంతో సహా ఇక్కడి వచ్చి మేడ్చల్‌ జిల్లా నిజాంపేటలో స్థిరపడ్డాడు. ఇతడికి తరుణ్‌రెడ్డి, అర్జున్‌రెడ్డి ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు కొల్లూరులోని గార్డియం స్కూల్‌లో 10, 7 తరగతి చదువుతున్నారు. అయితే పుట్టిన రోజున సందర్భంగా బంధువుల్లో ఒకరు తరుణ్‌రెడ్డికి చెస్‌ బోర్డును కానుకగా ఇచ్చారు. 
►    అప్పటి నుంచి చెస్‌ ఆడటం వ్యాపకంగా పెట్టుకున్న తరుణ్‌రెడ్డి ఆటలో ఆరి తేరాడు. అతడికి తమ్ముడు అర్జున్‌ తోడయ్యాడు. వీరి పట్టుదలని గమనించిన తండ్రి త్రినాథ్‌ కోచింగ్‌ ఇప్పించడంతో ఈ ఇద్దరు అన్నతమ్ముళ్లు నేడు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు.  
తరుణ్‌రెడ్డి సాధించిన ఘనత.. 
►   థాయ్‌ల్యాండ్‌లో అంతర్జాతీయ ఆసియా యూత్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌–2018లో అండర్‌–12 ఒపెన్‌ బ్లిడ్జ్‌లో టీమ్‌ బంగారు పతకం.  
►    శ్రీలంకలోని కొలంబోలో జరిగిన ఏషియన్‌ యూత్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌–2019 అండర్‌–14 ఒపెన్‌ క్లాసిక్‌లో టీమ్‌ బంగారు, ఒపెన్‌ బ్లిడ్జ్‌లో టీమ్‌ రజతం, ఒపెన్‌ బ్లిడ్జ్‌లో వ్యక్తిగతంగా 10వ స్థానం. రాష్ట్ర స్థాయిలో జరిగిన పలు టోర్నమెంట్‌లో పతకాలు సాధించాడు.

అర్జున్‌రెడ్డి సాధించిన విజయాలు..
►   జాతీయ స్థాయిలో మహారాష్ట్ర నాగ్‌పూర్‌ నేషనల్‌ స్కూల్స్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌– 2017 అండర్‌–7 ఒపెన్‌లో బంగారు పతకం.  
►   ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విజయవాడలో జరిగిన నేషనల్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌–2017 అండర్‌–7 విభాగం ఒపెన్‌లో 5వ స్థానం.  
►   హర్యానా నేషనల్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌– 2017 అండర్‌–9 ఒపెన్‌లో 4వ స్థానం.  
►    అంతర్జాతీయ స్థాయిలో థాయ్‌ల్యాండ్‌లో జరిగిన ఆసియా యూత్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌–2018 అండర్‌–8 విభాగంలో ఒపెన్‌ ర్యా పిడ్‌లో వ్యక్తిగత బంగారు, ఒపెన్‌ సాండర్డ్‌లో వ్యక్తిగత కాంస్యం, ఒపెన్‌ బ్లిడ్జ్‌లో నాల్గవ స్థా నం, ఒపెన్‌ ర్యాపిడ్‌లో టీమ్‌ బంగారు, ఒపె న్‌ స్టాండర్జ్‌లో టీమ్‌ రజతం, ఒపెన్‌ బ్లిడ్జ్‌లో టీమ్‌ బంగారు పతాలు సాధించాడు. 
►    న్యూఢిల్లీలో జరిగిన కామన్‌వెల్త్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌–2018 అండర్‌–8 విభాగం 
ఒపెన్‌లో కాంస్యం. 
►   గుజరాత్‌లో జరిగిన నేషనల్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌–2019 అండర్‌–9 ఒపెన్‌లో రజతం.  
►    ఢిల్లీలో జరిగిన నేషనల్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌–2019 అండర్‌–11 ఒపెన్‌లో 6వ స్థానం. 
►   శ్రీలంకలోని కొలంబోలో జరిగిన ఏషియన్‌ యూత్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌–2019 అండర్‌–10 విభాగం ఒపెన్‌ బ్లిడ్జ్‌లో వ్యక్తిగత కాంస్యం, ఒపెన్‌ బ్లిడ్జ్‌లో టీమ్‌ బంగారు, ఒపెన్ క్లాసిక్‌లో 6వ స్థానంలో నిలిచాడు. 
►    శ్రీలంకలో జరిగిన ఏషియన్‌ స్కూల్స్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌–2021 అండర్‌–11లో ఒపెన్‌ ఆన్‌లైన్‌లో 9వ స్థానం. 
►    ముంబాయిలో జరిగిన ఇంటర్నేషనల్‌ జూనియర్‌ చెస్‌ టోర్నమెంట్‌–2021 అండర్‌–13 లో 7వ స్థానం, ఒపెన్‌లో మొదటి స్థానంలో నిలిచాడు. 
►   కర్నాటకలో జరిగిన నేషనల్‌ చెస్‌ చాంపియన్‌ షిప్‌–2022 అండర్‌–12 ఒపెన్‌లో రజతంతో పాటు రాష్ట్ర స్థాయిలో జరిగిన పలు పోటీ ల్లో విజేతగా నిలిచాడు. ఇండియన్‌ చెస్‌ ఫెడ రేషన్‌లో అర్జున్‌రెడ్డి మూడో ర్యాంక్‌లో ఉన్నాడు.

చదవండి: ప్రియునితో భార్య రాసలీలలు.. అత్త ఛాలెంజ్‌.. ఆ అల్లుడు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని

మరిన్ని వార్తలు