మరో రెండ్రోజులు ఉక్కపోతే..

29 May, 2023 03:57 IST|Sakshi

రాష్ట్రం మీదుగా కొనసాగుతున్న ఉపరితలద్రోణి 

అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం 

సాక్షి, హైదరాబాద్‌: రానున్న రెండ్రోజులపాటు రాష్ట్రంలో సాధారణం కంటే ఒకటి నుంచి రెండు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణశాఖ వెల్లడించింది. పలు జిల్లాల్లో 40 నుంచి 44 డిగ్రీల సెల్సియస్‌ మధ్య, గ్రేటర్‌ హైదరాబాద్‌ సమీప జిల్లాల్లో మాత్రం 38 నుంచి 41 డిగ్రీల సెల్సియస్‌ మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశమున్నట్లు సూచించింది. కాగా, ఆదివారం రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రత నల్లగొండ జిల్లా నిడమనూరులో 46.1 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే...గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 42.4 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 24.0 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. 

ఉపరితలద్రోణి ప్రభావంతో తేలికపాటి వర్షాలు 
మరోవైపు విదర్భ నుంచి తెలంగాణ, ఉత్తర తమిళనాడు మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితలద్రోణి ఏర్పడిందని ఇది సముద్రమట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని వాతావరణశాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశమున్నట్లు సూచించింది.  

రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతాలు 
ప్రాంతం            జిల్లా               గరిష్ట ఉష్ణోగ్రత 
నిడమనూరు     నల్లగొండ                46.1 
దామెరచర్ల       నల్లగొండ                45.6 
బయ్యారం        మహబుబాబాద్‌       45.5 
తంగుల           కరీంనగర్‌                45.5 
కేతెపల్లి           నల్లగొండ                 45.3 

రాష్ట్రంలోని ప్రధాన కేంద్రాల్లో నమోదైన గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు (సెల్సియస్‌లో) 
కేంద్రం        గరిష్టం        కనిష్టం 
ఖమ్మం             42.4             30.0 
భద్రాచలం       42.2             28.0 
నల్లగొండ          42.2            24.8 
ఆదిలాబాద్‌      41.5             26.2 
రామగుండం    41.4           25.0 
హనుమకొండ    41.0          25.0 
నిజామాబాద్‌    40.9           29.5 
మెదక్‌              40.6                24.0 
మహబూబ్‌నగర్‌    40.5        28.5 
హైదరాబాద్‌    39.4             26.6 
దుండిగల్‌        38.5           24.9 
హకీంపేట్‌        37.5           23.9 

మరిన్ని వార్తలు