ములుగులో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు మావోలు హతం

18 Oct, 2020 15:56 IST|Sakshi

సాక్షి, ములుగు : జిల్లాలోని మంగపేట మండలంలో ఆదివారం పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎన్‌కౌంటర్‌ జరిగింది.రామచంద్రునిపేట అడవుల్లో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. మృతులను ఇటీవల టీఆర్‌ఎస్‌ నేత భీమేశ్వరావును హతమార్చిన మావోయిస్టులుగా గుర్తించారు.

కాగా, ఈ నెల 10న అర్ధరాత్రి సమయంలో మావోయిస్టులు ములుగు జిల్లా వెంకటాపురంలో టీఆర్ఎస్ నేత భీమేశ్వర రావుని అర్ధ రాత్రి బయటకు లాక్కొచ్చి చంపిన విషయం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇన్‌ఫార్మరనే నెపంతో మావోయిస్టులు ఈ ఘూతుకానికి పాల్పడ్డారు. ఈ కేసును ప్రేస్టేజియస్ గా తీసుకున్న పోలీసులు గస్తీ పెంచారు. ప్రతి రోజు కూంబింగ్ నిర్వహిస్తూ అనుమానితులను అరా తీస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది.
(చదవండి : ఇన్‌ఫార్మర్‌ నెపంతో టీఆర్‌ఎస్‌ నేత హత్య)

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు