వైరల్‌: మీరేనా.. మేమూ షికారు చేస్తాం!

3 Aug, 2021 13:41 IST|Sakshi
బైక్‌ పైకెక్కి అద్దంలో చూసుకుంటున్న వానరం, ఆటో టాప్‌పై కూర్చొని ఫోజు కొడుతోన్న కోతి

మీరే కాదు మేము కూడా షికారు చేయగలమంటున్నాయి వానరాలు! నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో సోమవారం రెండు కోతులు వాహనాలెక్కి ఫోజులు కొట్టాయి. ఓ వానరం బైక్‌ అద్దంలో చూసుకుని హొయలు పోగా, మరో కోతి ఆటో టాప్‌పైన ఠీవీగా కూర్చుంది. ఈ రెండు చిత్రాలను ‘సాక్షి’ తన కెమెరాలో బంధించింది.
– నాగిరెడ్డిపేట

మరిన్ని వార్తలు