'చెత్తతో సంపద సృష్టిచడం మంచి కాన్సెప్ట్ '

7 Nov, 2020 12:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : హైదరాబాద్‌ జీడిమెట్లలో భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్‌ను మంత్రి కేటీఆర్‌  ప్రారంభించారు. ఈ ప్లాంట్ దక్షిణ భారతదేశంలోనే పెద్ద ప్లాంట్‌ అని అన్నారు. ఎల్బీనగర్ ఫతుల్ గూడలో సంక్రాంతి రోజున మరో ప్లాంట్‌ను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో రోజుకు  2వేల టన్నుల భవన నిర్మణా వ్యర్థాలు వస్తున్నాయని, చెత్త నుంచి సంపద సృష్టించడం మంచి కాన్సెప్ట్ అని మంత్రి పేర్కొన్నారు. త్వరలోనే మరో రెండు ప్లాంట్లను కూడా ప్రారంభిస్తాం అని తెలిపారు. మున్సిపల్ వెస్ట్ మేనేజ్‌మెంట్‌లో  జీహెచ్‌ఎంసీ అద్భుతంగా పనిచేస్తున్నారని కొనియాడారు. వ్యర్థాలు ప్రజలకు హానికరంగా మారకుండా చర్యలు తీసుకుంటామని, ఇందుకు ప్రజలు కూడా సహకరించాలని పేర్కొన్నారు. చెత్తని ఎక్కడ పడితే అక్కడ వేయవద్దని, చెత్త తరలింపునకు 180012007669  టోల్ ఫ్రీ నెంబర్‌ను సం‍ప్రదించాలని కోరారు. 

మరిన్ని వార్తలు