రెండు నదులు.. రెండు రంగులు

19 Aug, 2021 10:00 IST|Sakshi

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదులు కలుస్తాయి. గోదావరి తెలంగాణలోని మంచిర్యాల మీదుగా, ప్రాణహిత నది మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా నుంచి వచ్చి కాళేశ్వరం వద్ద కలుస్తోంది. దీంతో రెండు నదులు కలవడంతో మూడవ నదిగా సరస్వతి నది ఉద్భవిస్తుంది. దీనినే గుప్త నదిగా పిలుస్తారు.

బుధవారం గోదావరి వరద నీరు లేత నీలిరంగులో, ప్రాణహిత వరద నీరు లేత ఎరుపు రంగుల్లో కనిపించి చూపరులను ఆకర్షించింది. రెండు నదులు ఒకేచోట రెండు రంగుల్లో వేర్వేరుగా కనిపించడంతో కాళేశ్వరానికి వచి్చన భక్తులు ఆసక్తిగా తిలకించారు.      – కాళేశ్వరం   
 

మరిన్ని వార్తలు