ఫంక్షన్‌కు వెళ్లి వస్తూ అనంతలోకాలకు..

27 Jul, 2021 02:12 IST|Sakshi
మల్లికార్జున్‌, రాజ్యలక్ష్మి, దేవాన్‌

రెండు వాహనాలు ఢీకొని ముగ్గురు మృతి  

మృతులంతా ఒకే కుటుంబసభ్యులు 

వికారాబాద్‌ జిల్లాలో ఘటన  

పూడూరు: ఓ ఫంక్షన్‌కు వచ్చి తిరిగి వెళ్తున్న ఒకే కుటుంబంలోని ముగ్గురిని క్వాలిస్‌ రూపంలో మృత్యువు కబళించింది. ఈ ఘటన సోమవారం వికారాబాద్‌ జిల్లాలో చోటు చేసుకుంది. వికారాబాద్‌కు చెందిన సంతోష్‌రెడ్డి(36), స్వాతి దంపతులు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు. ఉద్యోగరీత్యా స్వాతి యూఎస్‌లో ఉంటోంది. సంతోష్‌రెడ్డి తన తల్లిదండ్రులు మల్లికార్జున్‌రెడ్డి (60) రాజ్యలక్ష్మి(56), కుమారుడు దేవాన్‌ రెడ్డి(6)తో కలసి హైదరాబాద్‌లోని నార్సింగ్‌లో ఉంటున్నారు. వికారాబాద్‌లోని తమ బంధువుల ఇంట్లో ఆదివారం జరిగిన దావత్‌కు సంతోష్‌రెడ్డి తన తల్లిదండ్రు లు, కుమారుడితో కలిసి వచ్చారు. మరుసటిరోజు ఉద యం కారులో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యా రు. పూడూరు మండలం అంగడిచిట్టంపల్లి సమీపంలో రాంగ్‌రూట్‌లో వేగంగా దూసుకొచ్చిన క్వాలిస్‌ వాహనం వీరి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మల్లికార్జున్‌రెడ్డి, దేవాన్‌ రెడ్డి, రాజ్యలక్ష్మి మృతిచెందారు. సంతోష్‌రెడ్డి, క్వాలిస్‌ డ్రైవర్‌ మహ్మద్‌గౌస్, మరోవ్యక్తి గాయపడ్డారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు