మొన్న పిల్లి.. నేడు ఆబోతు.. 

12 Apr, 2022 10:49 IST|Sakshi

చిలుకూరు: సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ పోలీసులు కొద్దిరోజుల క్రితం పిల్లిపోరును తీర్చగా, తాజాగా సోమవారం చిలుకూరు పోలీసులు ఓ ఆబోతు పంచాయితీని పరిష్కరించారు. చిలుకూరు మండలం సీతారాంపురం గ్రామస్తులు ఆరేళ్ల క్రితం రామాలయం నిర్మించి గుడిపేరిట ఓ ఆబోతును వదిలేశారు. నెల రోజులుగా అది కనిపించకపోవడంతో గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఇటీవల చిలుకూరులో ఆ ఆబోతును గంగిరెద్దు మాదిరిగా ఆడిస్తుండటంతో గమనించిన గ్రామస్తులు పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. రెండు గ్రామాల పెద్దల సమక్షంలో పోలీసులు పంచాయితీ నిర్వహించారు. గంగిరెద్దులవారు రూ. 30 వేల జరిమానా చెల్లించి ఆబోతును అప్పగించారు.

మరిన్ని వార్తలు