యాదాద్రిలో విషాదం: దోసల వాగులో ఇద్దరు యువతుల గల్లంతు

30 Aug, 2021 16:21 IST|Sakshi
ఇన్‌సెట్‌లో సింధుజ

యాదాద్రి: రాజపేట మండలం కుర్రారం గ్రామంలోని దోసల వాగులో ఇద్దరు యువతులు గల్లంతు అయ్యారు. హిమబిందు, సింధుజ అనే యువతులు ఇటుకలపల్లి వెళ్లి తిరిగి కుర్రారం గ్రామానికి వెళ్తుండగా వాగులో నీటి ప్రవాహనికి గల్లంతు అయ్యారు. వాగు దాటుతుండగా మధ్యలో స్కూటీ ఆగిపోవడంతో వాగు ఉదృతికి కొట్టుకుపోయారు.

సమాచారం అందుకున్న పోలీసులు స్థానికులతో కలిసి గల్లంతైన యువతులిద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఘటనాస్థలికి కొంతదూరంలో కొట్టుకుపోతున్న సింధుజను గమనించిన స్థానికులు ఆమెను కాపాడి బయటకు తీసుకొచ్చారు. అనంతరం సింధుజను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సింధుజ మృతి చెందింది. వాగులో గల్లంతైన హిమబింధు కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మరిన్ని వార్తలు