తెలంగాణలో నిరుద్యోగం తగ్గుముఖం..7.4 నుంచి 4.2 శాతానికి..

4 Nov, 2021 04:21 IST|Sakshi

ఏపీలో 17.9 నుంచి 5.4 శాతానికి... 

సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ నివేదిక

సాక్షి, న్యూఢిల్లీ: రెండు తెలుగురాష్ట్రాల్లో నిరు ద్యోగం తగ్గుముఖం పడుతోంది. ఈ రాష్ట్రాల్లో నిరు ద్యోగిత జాతీయసగటు కంటే మెరుగ్గా ఉంది. ఈ వివరాలను సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది అక్టో బర్‌ నాటికి జాతీయస్థాయి నిరుద్యోగరేటు 7.75% ఉండగా, తెలంగాణలో 4.2, ఆంధ్రప్రదేశ్‌లో 5.4 శాతం చొప్పున నమోదైందని తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని నెలలుగా నిరుద్యోగరేటు క్రమేపీ తగ్గుతోందని నివేదిక పేర్కొంది.

అగ్రస్థానంలో హరియాణా: నిరుద్యోగరేటులో హరియాణాదే అగ్రస్థానం. జాతీయసగటు కంటే ఎక్కువశాతం నమోదైన రాష్ట్రాల్లో హరియాణా (30.7 శాతం), రాజస్థాన్‌ (29.6 శాతం), జమ్మూ, కశ్మీర్‌ (22.2 శాతం), జార్ఖండ్‌(18.1 శాతం), హిమాచల్‌ప్రదేశ్‌ (14.1 శాతం), బిహార్‌ (13.9 శాతం), గోవా (11.7 శాతం), పంజాబ్‌ (11.4 శాతం), ఢిల్లీ (11 శాతం), సిక్కిం (10 శాతం), త్రిపుర (9.9 శాతం)లు ఉన్నాయి. మిగిలిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జాతీయ సగటు కంటే తక్కువ నిరుద్యోగరేటు నమోదైంది.  


 

మరిన్ని వార్తలు