మహాత్ముని సమాధి ముందే మద్యం తాగుతూ, మాంసం తింటూ

1 Jul, 2021 09:46 IST|Sakshi

మహాత్మా.. మన్నించు

పట్టించుకోని పోలీసులు,  పర్యాటకశాఖ అధికారులు

సాక్షి, హైదరాబాద్‌: అసాంఘిక కార్యకలాపాలకు లంగర్‌హౌస్‌లోని బాపూఫట్‌ అడ్డాగా వరింది. జాతిపిత మహాత్మాగాంధీని ప్రపంచ దేశ ప్రజలంతా  గౌరవిస్త ఆయన సమాధిని పవిత్ర మందిరంగా భావిస్తారు. అయితే దక్షిణాదిలో ఉన్న బాపూజీ ఏకైక సమాధి లంగర్‌హౌస్‌ త్రివేణి సంగం వద్ద ఉన్నది. ఇంతటి పవిత్రమైన ప్రాంతం మందుబాబులకు అడ్డాగా మారింది. పోలీసులు కూడా చూసీ చూడనట్లు వ్యవహరించడంతో వీరి ఆగడాలకు హద్దులు లేకుండా పోయాయి. 

పేకాట, మద్యం, మాంసం..
మామూలుగానే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నేరం. అయితే పోకిరీలు నిత్యం  బాపూ సమాధి ఎదురుగా కూర్చొని మద్యం సేవిస్తున్నారు. ఆ ఖాళీ మద్యం బాటిళ్లు బాపూ సమాధి ప్రాంగణంలోకి విసురుతున్న సంఘటనలు ఉన్నాయి. ఓ వైపు దేవాలయం, మరో వైపు బాపూ సమాధి ఉన్నాయని ఇక్కడ మద్యం సేవించకూడదని చెప్పిన వారిపై దాడులకు  పాల్పడుతున్నారు.  సమాధి ప్రాంతాన్ని తమ అదుపులో పెట్టుకున్న తెలంగాణ పర్యాటక శాఖ అధికారులు కూడా పోకిరీల బెడదను అరికట్టడంలో విఫలమవుతున్నారు. ఇక్కడే మాంసాహారం తింటూ పేకాట ఆడుతున్నారు. తాజాగా శనివారం మద్యం సేవిస్త వంసం తింటున్న వారిని స్థానికులు, భక్తులు నిలదీయగా వారిపై దాడికి యత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు. 

రాత్రివేళల్లో..  
పోకిరీలు ఇంతటితో ఆగకుండా రాత్రి వేళ్లలో  మరింతగా ర్చెపోతున్నారు. ఏటవాలు ఆకారంలో బాపూ సమాధి నిర్మాణం ఉండటంతో దాని కింద అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. రాత్రయితే చాలు బాపూ సమాధి కింద యథేచ్ఛఫగా వ్యభిచారకార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఆలయం, బాపూ సవధి ఉన్న ఇంతటి పవిత్ర ప్రాంతంలో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా అరికట్టాలని స్థానికులు, ఆలయ నిర్వాహకులు కోరుతున్నారు. బాపూఫట్‌ నిర్వహణపై ప్రైవేట్‌ వ్యక్యులకు, ప్రభుత్వానికి హక్కు ఉండటంతో ఎవర పట్టించుకోవడంలేదని దీంతో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. అధికారులు స్పందిం బాపూ సమాధి, రామాలయాల పవిత్రతను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. 

అధికారుల నిర్లక్ష్యమే.... 
బాపూ సమాధి ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలకు అధికారుల నిర్లక్ష్యమే కారణం. బాపూఫట్‌ ప్రాంగణానికి కొద్ది దరంలోనే త్రివేణి సంగం ఒడ్డున మహాత్ముని సమాధి నిర్మించారు. దీని నిర్వహణను ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించడంతో వారు నిత్యం బాపూఫట్‌కు తాళం వేసి,  సవధి ఉన్న ప్రాంగణాన్ని గాలికి వదిలేస్తున్నారు. వీరితో పాటు పర్యాటక శాఖ అధికారులు కూడా తమకు సంబంధం లేదని దాటవేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి బాపూ సమాధి ప్రాంతంలో సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. 

చదవండి: అది బస్తీ దవాఖానా.. కానీ అక్కడికి ఐఏఎస్‌లూ వస్తారు

మరిన్ని వార్తలు