వీధి వ్యాపారులకు రుణాలు: కిషన్‌రెడ్డి

5 Sep, 2020 17:12 IST|Sakshi

కేంద్ర హోం శాఖ సహాయ శాఖ కిషన్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పథకంపై సమీక్ష నిర్వహించామని కేంద్ర హోం శాఖ సహాయ శాఖ కిషన్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో పత్తి సీజన్ అక్టోబర్ నుండి ప్రారంభం కాబోతోందని, మార్క్‌ఫెడ్, సీసీఐ అధికారులతో చర్చించామని ఆయన పేర్కొన్నారు. వీధి వ్యాపారులు స్వనిధి పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని, ఇప్పటికే హైదరాబాద్‌లో రెండు లక్షల మంది వీధి వ్యాపారులకు రుణాలు ఇవ్వాలని అధికారులను అదేశించామని ఆయన వెల్లడించారు.

‘‘ఆవాస్ యోజన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి చేపట్టలేదు. ఇళ్ల రుణం  కోసం సుమారు లక్ష దరఖాస్తులు వచ్చాయి. కానీ వాటిని వేరిఫై చేయలేదు. గత మూడేళ్ళుగా దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్నాం. హైదరాబాద్‌లో కూడా ఆవాస్ యోజన చేపట్టాలని సూచించాం. ఆవాస్ యోజన రుణం అందరూ ఉపయోగించుకోవాలని’’ ఆయన పేర్కొన్నారు. 165 వెల్నెస్ సెంటర్స్, బస్తీ దవాఖానాలు ఉన్నాయని, కొన్ని ఇప్పటికే ప్రారంభం అయ్యాయన్నారు. కేంద్రం నిధులు ఇస్తుంది కాబట్టి వీటిని ఏర్పాటు చేయాలని అధికారులకు చెప్పామని తెలిపారు.

ఈ ఏడాది పత్తి బాగా పండిందని, సీసీఐ మూడు కేంద్రాలుగా పనిచేస్తుందన్నారు. తెలంగాణలో సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు చేయాలని సూచించామని పేర్కొన్నారు. మోదీ అధికారంలోకి వచ్చిన కొత్తలో 3800 పత్తి ధర ఉండేదని, ప్రస్తుతం 5280 మద్దతు ధర ఉందని కిషన్‌రెడ్డి తెలిపారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు