బొగ్గు గనుల వేలంతో రాష్ట్రానికే ఆదాయం 

14 Nov, 2022 01:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వేలం ద్వారా గనుల కేటాయింపులు జరిపితే తెలంగాణ రాష్ట్రానికే తగిన ఆదాయం దక్కు­తుం­దని కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి ట్వీట్‌ చేశారు. కానీ కేసీఆర్‌ ప్రభుత్వం వేలానికి విముఖత చూపి, ఒక్క బ్లాక్‌ కూడా కేటాయించకుండా ఉండటం వల్ల రాష్ట్ర అభివృద్ధికి విఘాతం కలుగుతోందని తెలిపారు.  సింగరేణిలో 51% వాటా తెలంగాణ ప్రభుత్వం వద్ద ఉందని స్పష్టంచేశారు.

సింగరేణి ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని, అది రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే చేయగలదని చెప్పారు. అలాగే సింగరేణికి నైని, పెనగడ్డప్ప, న్యూ పాత్రపర అనే 3 బొగ్గు గనులు కేటాయించినట్లు గమనించాలని సూచించారు. అయితే అవినీతిలో కూరుకుపోయిన తెలంగాణ ప్రభుత్వం 7 ఏళ్ల నుంచి ఈ బ్లాకులను వినియోగించలేకపోయిందని, వేలం మార్గాన్ని నిరాకరించడం వల్ల రాష్ట్రానికి రాయల్టీ, ఆదాయం విషయంలో గండి పడుతోందని జోషి వెల్లడించారు.   

మరిన్ని వార్తలు