ఆ ఊర్లో ఏదో జరుగుతుంది.. వరుస మరణాలతో ఆందోళన

6 Jul, 2021 07:40 IST|Sakshi

వరుస మరణాలతో  భయాందోళనలో ప్రజలు 

గ్రామం ఖాళీ చేసి వెళ్తున్న బేతాళ్‌గూడ గ్రామస్తులు

తాంసి(బోథ్‌): వరుస మరణాలతో ఆ గిరిజనం మనసు కీడు శంకిస్తోంది. గ్రామానికి ఏదో కీడు జరిగిందని.. మరణాలకు అదే కారణమని భయం వెంటాడుతోంది. ఆదిలాబాద్‌ జిల్లా తాంసి మండలం గిరిగాం గ్రామ పంచాయతీ పరిధి బేతాళ్‌గూడ గ్రామం నుంచి ఒక్కో కుటుంబం ఇళ్లను ఖాళీ చేసి వెళ్తోంది. ఇక్కడ 20 గృహాలు, 60 మంది జనాభా ఉంటుంది. కొన్ని నెలలుగా  వీరు అనారోగ్యానికి గురై మృత్యువాత పడుతున్నారు. మృతులంతా పురుషులే. రెండేళ్లలో 12 మంది మరణించినట్లు సమాచారం.

జూన్‌లో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మృతిచెందగా అదే కుటుంబంలో మూడు నెలల కిందట ఒకరు, ఆరు నెలల కిందట మరొకరు అనారోగ్యంతో చనిపోయారు. గ్రామానికి ఏదో కీడు జరిగిందని గ్రామస్తుల్లో భయం మొదలైంది. గ్రామంలో ఉంటే తామూ చనిపోతామని ఊరు వదిలి వెళ్లారు. బేతాళ్‌గూడకు రెండు కిలోమీటర్ల దూరంలోని అంబుగాం గ్రామ పాఠశాల సమీపంలో తొమ్మిది కుటుంబాలు తాత్కాలిక షెడ్లు వేసుకున్నాయి. వామన్‌నగర్‌ గ్రామంలో మరో ఐదు కుటుంబాలు షెడ్లు వేసుకుని నివాసం ఉంటున్నాయి. 


అంతుచిక్కని మరణాలు..
గిరిజనులు ఎలా మృతిచెందారో అంతుచిక్కడం లేదు. మరణానికి కారణం అనారోగ్యమా..? సీజనల్‌ వ్యాధులా..? దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలా..? అనేది ఎవరికీ తెలియడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు గిరిజనులకు సరైన అవగాహన కలి్పంచడం లేదు. మరణాలకు కారణాలు తెలుసుకుని గ్రామస్తులకు అవగాహన కలి్పస్తే ప్రజలు తిరిగి వచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.    

>
మరిన్ని వార్తలు