పైగా టూంబ్స్‌కు అమెరికా సాయం 

11 Jan, 2023 01:39 IST|Sakshi
పైగా టూంబ్స్‌ వద్ద ఎలిజబెత్‌ జోన్స్, జెన్నిఫర్‌ లార్సెన్‌   

పరిరక్షణ కోసం రూ.2.04 కోట్ల ఆర్థిక సాయం  

సంతోష్ నగర్ (హైదరాబాద్‌): భవిష్యత్తు తరాల కోసం అమూల్యమైన శిల్ప సంపదను పరిరక్షించాలని అమెరికా చార్జ్‌ డి అఫైర్స్‌ ఎలిజబెత్‌ జోన్స్‌ చెప్పారు. మంగళవారం ఆమె అమెరికా కాన్సుల్‌ జెన్నిఫర్‌ లార్సెన్‌తో కలిసి సంతోష్ నగర్ ఒవైసీనగర్‌ కాలనీలోని పైగా టూంబ్స్‌ (సమాధి)ను సందర్శించారు. 18, 19వ శతాబ్దాల్లో నిర్మించిన పైగా సమాధుల పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగమైనందుకు తాము గరి్వస్తున్నామని ఎలిజబెత్‌ చెప్పారు.

ఆరుకు పైగా సమా«ధుల పరిరక్షణ, పునరుద్ధరణకు కోసం అమెరికా ‘అంబాసిడర్స్‌ ఫండ్స్‌ ఫర్‌ కల్చరల్‌ ప్రిజర్వేషన్‌ (ఏఎఫ్‌సీపీ)’రూ.2.04 కోట్ల సాయం చేసిందని ఆగాఖాన్‌ ట్రస్ట్‌ ఫర్‌ కల్చరల్‌ ఇండియా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ రతీష్‌ నందా తెలిపారు. ఈ ప్రాజెక్టును ఆగాఖాన్‌ ట్రస్ట్‌ అమలు చేస్తోందన్నారు. ఇది హైదరాబాద్‌లోని యూఎస్‌ కాన్సులేట్‌ ద్వారా నిధులు సమకూర్చిన ఐదో ప్రాజెక్టని కాన్సుల్‌ జనరల్‌ జెన్నిఫర్‌ లార్సెన్‌ చెప్పారు. హైదరాబాద్‌లో కుతుబ్‌షాహీ టూంబ్స్‌ వద్ద తమ ఏఎఫ్‌సీపీ ప్రాజెక్టుల్లో ఒకదాన్ని ప్రారంభించే అదృష్టం తనకు దక్కిందన్నారు. 

మరిన్ని వార్తలు