ఏపీ పరిశీలకుడిగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

28 Dec, 2022 08:38 IST|Sakshi

తెలంగాణ పరిశీలకుడిగా గిరీష్‌చోడాంకర్‌

సాక్షి, న్యూఢిల్లీ: ఏఐసీసీ ఆధ్వర్యంలో జనవరి 26 నుంచి ప్రారంభించనున్న ‘హాత్‌ సే హాత్‌’ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్‌ పరిశీలకుడిగా ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి నియమితులయ్యారు. అలాగే తెలంగాణ పరిశీలకుడిగా గోవా పీసీసీ మాజీ అధ్యక్షుడు గిరీష్‌చోడాంకర్‌ను నియమించారు.

మహారాష్ట్ర పరిశీలకుడిగా కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు, గోవా పరిశీలకుడిగా పీసీసీ మాజీ అధ్యక్షుడు శైలజానాథ్, పుదుచ్చేరి పరిశీలకుడిగా మాజీ ఎంపీ వి.హనుమంతరావును నియమించారు. ఏఐసీసీ మాజీ అ­ధ్య­క్షుడు రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యా­త్రకు కొనసాగింపుగా  ‘హాత్‌ సే హాత్‌’ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశాల మేరకు నియమితులైన అన్ని రాష్ట్రాల పరిశీలకుల వివరాలను ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ మంగళవారం ఓ ప్రకటన ద్వారా విడుదల చేశారు.   

చదవండి: (దళిత మహిళపై చెయ్యెత్తిన పరిటాల సునీత)

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు