TS: నీటిపారుదల శాఖలో భారీ ప్రక్షాళన

7 Feb, 2024 21:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ నీటిపారుదల శాఖలో తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రక్షాళన చేసింది. ఇరిగేషన్ ఈఎన్‌సీ(జనరల్)గా ఉ‍న్న మురళీధర్‌ను రాజీనామా చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆదేశించారు. అలాగే రామగుండం ఈఎన్‌సీ, కాళేశ్వరం ప్రాజెక్టు ఇన్‌ఛార్జ్‌ వెంకటేశ్వరరావును తెలంగాణ ప్రభుత్వం సర్వీస్‌ నుంచి తొలగించింది.

ఇటీవల ఇరిగేషన్ ఈఎన్‌సీ మురళీధర్‌‌‌‌ను పదవి నుంచి తొలగించాలని పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు, రిటైర్డ్ ఈఎన్‌సీ అధికారులు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఇరిగేషన్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌లో మురళీధర్‌.. 11 ఏండ్లకు పైగా ఎక్స్‌‌టెన్షన్‌‌పై కొనసాగుతున్నారు. 2013లో ఈఎన్‌సీగా మురళీధర్ రిటైర్ అయ్యారు.

అప్పటి నుంచి మురళీధర్‌ ఎక్స్‌‌‌‌టెన్షన్‌‌‌‌పై కొనసాగుతున్న విషయం తెలిసిందే. మాజీ సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత మురళీధర్‌  కాళేశ్వరం ప్రాజెక్టు రీ డిజైనింగ్ సహా అనేక ప్రాజెక్టులకు పని చేశారు. ఇటీవల మురళీధర్‌ను పదవి నుంచి తొలగించి.. విచారిస్తే ప్రాజెక్టుల అక్రమాలు బయటకు వస్తాయని పలు డిమాండ్లు వెల్లువెత్తాయి.

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega