Valentines Day 2023 Gifts: ప్రేమ కానుక.. మనసు దోచెనిక.. ప్రేమికుల రోజు ఇచ్చే గిఫ్ట్‌లు ఇవే..!

13 Feb, 2023 12:01 IST|Sakshi

కరీంనగర్‌: ఫిబ్రవరి 14.. ప్రేమికుల రోజు.. ఒకరికొకరు తమ ప్రేమను వ్యక్తం చేసే సందర్భం. ప్రేమలో ఉన్నవారు ఆరోజు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్లాన్‌ చేసుకుంటున్నారు. తమ మనసులో మాట చెప్పేందుకు ఎదురుచూస్తున్నారు. మదిలో ప్రేమ సందేశాలను ఇచ్చిపుచ్చుకునేందుకు మార్కెట్లో ఎన్నో వస్తువులు అందుబాటులోకి వచ్చాయి. కేక్‌లు ప్రత్యేక డిజైన్లలో ఆకట్టుకుంటున్నాయి. ఆయా దుకాణాలు యువతీ యువకులతో కళకళలాడుతున్నాయి. వారు మెచ్చిన, నచ్చిన ఫొటోలు ఫ్రేమ్‌లో బంధించి ఇవ్వడంతోపాటు లవర్స్‌ స్పెషల్‌ కీచైన్‌లు, టుడే అండ్‌ టుమారో, జస్ట్‌ ఫర్‌ యూ అనే హార్ట్‌ పిల్లోస్‌పై ఆసక్తి చూపుతున్నారు.

అలాగే ప్రేమికుల కోసం ఎన్నో రకాల విదేశీ చాక్లెట్లు నోరూరిస్తున్నాయి. గతంలో కంటే ఈసారి వెరైటీ గిఫ్ట్‌లు అందుబాటులో ఉన్నాయని వ్యాపారులు అంటున్నారు. ముఖ్యంగా చైనా క్రిస్టల్‌తో తయారైన ఉత్పత్తులు యువతను ఆకర్షిస్తున్నాయి. ఇష్టమైన వారి ప్రేమను పొందేందుకు కానుకలు మంచి సాధనాలుగా పని చేస్తాయని నమ్మేవాళ్లు వాటిని కొనుగోలు చేస్తున్నారు.

ఏటా ఒక బహుమతి ఇస్తా
మాది ప్రేమ వివాహం. ఏటా ప్రేమికుల దినోత్సవం రోజు తప్పనిసరిగా మా వారికి ఏదో ఒక బహుమతి ఇస్తా. ఈసారి అది ప్రత్యేకంగా ఉండాలని షాపింగ్‌ చేస్తున్నా. ప్రేమ జీవితంలో భాగం కావాలి.  
– తాటి అమల పవన్, సవరన్‌ స్ట్రీట్‌ 

అందుబాటులో లవ్‌ గిఫ్ట్స్‌.. 
ఈసారి మా స్టోర్‌లో రూ.100 నుంచి రూ.2 వేల విలువైన లవ్‌ గిఫ్ట్స్‌ అందుబాటులో ఉంచాం. ప్రేమికులు రేటు ఆలోచించకుండా అందమైన బహుమతులు కొనుగోలు చేస్తున్నారు. 
– ఈశ్వర్, గణేశ్‌ జనరల్‌ స్టోర్, శాస్త్రీరోడ్‌ 

ప్రేమను ఇచ్చిపుచ్చుకోవాలి
బహుమతుల కన్నా ప్రేమను ఇచ్చిపుచ్చుకుంటే అది జీవితాంతం చెదిరిపోకుండా ఉంటుంది. నాకు కాబో యే శ్రీవారి కోసం ఈ సంవత్సరం ప్రత్యేక బహుమతి కొనుగోలు చేసి, పంపిస్తున్నాను. 
– ఉపాధ్యాయుల రుత్విక, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని, మంకమ్మతోట 

లవ్‌ సింబల్స్‌ ఉన్నవే ఎక్కువ..
లవ్‌ సింబల్స్‌ ఉన్న వస్తువులు, బొమ్మల విక్రయాలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో మంచి కొటేషన్లతో గ్రీటింగ్‌ కార్డులు వచ్చేవి. ఇప్పుడు రావడం లేదు. ఇంటర్నెట్‌ నుంచి తీసుకొని, ఇచ్చుకుంటున్నారు. 
 – ఉప్పుగల్ల మురళీకష్ణ, వాణిశ్రీ బుక్స్, స్టేషనరీ, 7హిల్స్‌ 
చదవండి: ఏకకాలంలో ఒక్కటైన 220 జంటలు

మరిన్ని వార్తలు