ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వనజీవి రామయ్య

6 Jul, 2021 08:57 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

సాక్షి, ఖమ్మం: పద్మశ్రీ అవార్డ్ గ్రహీత, ప్రకృతి ప్రేమికుడు వనజీవి రామయ్య ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో మూడు రోజుల క్రితం కుటుంబ సభ్యులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఐసీయూలో చేర్చి వైద్యులు ప్రత్యేక వైద్య సేవలందించారు. ఆస్తమా, గుండె, ఊపిరితిత్తుల సమస్యలతో రామయ్య ఇబ్బంది పడుతున్నారని వైద్యులు తెలిపారు. కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని రామయ్యకు సూచించారు.

విశ్రాంతి తీసుకోవడం అవసరం
కాగా ఇటీవల వనజీవి రామయ్య మరోసారి అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. గడిచిన మూడు నెలల వ్యవధిలో మూడు సార్లు అస్వస్థతకు గురయ్యారు రామయ్య. ప్రస్తుతం ఆయ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు తెలిపారు. హరితహరంలో భాగంగా రామయ్య గ్రామాల్లో తిరుగుతు చెట్లు నాటుతు ఉండటం వల్ల శ్వాస కోశ ఇబ్బందులు వచ్చాయని, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రామయ్య బయట తిరగకుండా విశ్రాంతి తీసుకోవడం అవసరమన్నారు. వయసు భారం దృష్ట్య రామయ్య కోన్ని ఆనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పుతున్నారన్నారు.

కాగా గత కొంతకాలంగా వనజీవి రామయ్య అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికి గురై ఆసుపత్రిలో చేరిన రామయ్య అనంతరం కోలుకున్నారు. అయితే నిరంతరం మొక్కల గురించి ఆలోచించే ఆయన.. ఏంత ఇబ్బంది ఉన్న మొక్కలను నాటే కార్యక్రమంను మాత్రం ఏ రోజు వాయిదా వేయరు. ప్రతి రోజు మొక్కలను నాటుతునే ఉండాలన్నది ఆ కోరిక. అంతేకాదు తన చివరి శ్వాస పోయే వరకు కూడా మొక్కలను నాటుతునే ఉంటానని సాక్షి ఇంటర్వ్యూలో కూడ రామయ్య చెప్పుకొచ్చారు. 50ఏళ్ల నుంచి మొక్కలను నాటుతూ వస్తున్న రామయ్య.. ఇప్పటి వరకు 3కోట్ల మొక్కలను నాటారు.

మరిన్ని వార్తలు