‘వాసాలమర్రి’ ఆగవ్వకు అస్వస్థత

25 Jun, 2021 05:06 IST|Sakshi

తుర్కపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో ఈనెల 22న నిర్వహించిన గ్రామసభ, సహపంక్తి భోజనాల్లో సీఎం కేసీఆర్‌తో కలిసి పాల్గొన్న ఆకుల ఆగవ్వ అస్వస్థతతో ఆస్పత్రిలో చేరింది. వాసాలమర్రిలో సభ ముగించుకొని ఇంటికి వెళ్లాక ఆగవ్వకు తీవ్ర కడుపునొప్పి రావడంతో భువనగిరి జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు.

కడుపునొప్పి పూర్తిగా తగ్గిన తర్వాత గురువారం ఇంటికి పంపారు. ఎండ లో తిరగడంతో ఆమె అస్వస్థతకు గురైందని జిల్లా కేంద్రాస్పత్రి సూపరింటెండెంట్‌ తెలిపారు. కాగా, గ్రామంలో దాదాపు 20 మంది సైతం అస్వస్థతకు గురయ్యారని సమాచారం. ఫుడ్‌ పాయిజనింగ్‌ కారణమై ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.   

మరిన్ని వార్తలు