బీజేపీ రాష్ట్ర ఆఫీస్‌కు మరోసారి ‘వాస్తు’ మార్పులు

23 Aug, 2022 03:24 IST|Sakshi
ప్రధాన ద్వారం తొలగించిన దృశ్యం 

హంపి పీఠాధిపతి సూచనల మేరకు మార్పుచేర్పులు 

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయ భవనంలో మరోసారి వాస్తుకు సంబంధించిన మార్పులు జరుగుతున్నాయి. నాంపల్లిలోని పార్టీ కార్యాలయం నిర్మించిన నాటినుంచి పలుమార్లు నిర్మాణపరమైన మార్పులు చేశారు. వాస్తుకు భిన్నంగా ఉన్నా­యని టాయ్‌లెట్లను గతంలోనే తొలగించి, కార్యాలయం వెనుక భాగంలో నిర్మించారు. తొలుత నిర్మించిన ప్రధాన ద్వారాన్ని మూసేసి పక్కవైపు నుంచి మెటల్‌ స్టెప్స్‌తో మరో ద్వారం తెరిచారు.

ప్రధాన ద్వారాన్ని కొంతకాలంగా మూసేశారు. గతంలోని ప్రధాన ద్వారానికి కింద కొంత దూరంలో ఉన్న సెల్లార్‌కు వెళ్లే దారిని కూడా మూసేసి, దానిపై ఒక గదిని నిర్మించారు. తాజాగా మళ్లీ వాస్తుకు అనుగుణంగా మార్పుచేర్పులకు రాష్ట్రబీజేపీ నాయకత్వం శ్రీకారం చుట్టింది. పాత ప్రధాన ద్వారాన్ని పూర్తిగా తొలగించి, సెల్లార్‌ మార్గం మీదుగా కొత్త ప్రధాన ద్వారం ఏర్పాటు దిశగా పనులు సాగుతున్నాయి. హంపి పీఠాధిపతి సూచనల మేరకు వాస్తును పాటిస్తూ ఈ మార్పులు చేర్పులు జరుగుతు­న్నాయి. పార్టీ  బలోపేతాన్ని దృష్టిలో పెట్టుకొని మా­ర్పులు చేస్తున్నట్టు పార్టీవర్గాల సమాచారం.   

మరిన్ని వార్తలు