సింగరేణికి కొత్త డైరెక్టర్లు.. 

26 Sep, 2020 03:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సింగరేణి బొగ్గు గనుల సంస్థలో ఇద్దరు కొత్త డైరెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం నియమిం చింది. ప్రాజెక్టులు, ప్లానింగ్‌ (పి–పి) విభాగం డైరెక్టర్‌గా బి.వీరారెడ్డి, ఎలక్ట్రికల్‌–మెకానికల్‌ విభాగం డైరెక్టర్‌గా డి.సత్యనారాయణను నియమించింది. ఖాళీగా ఉన్న రెండు డైరెక్టర్‌ పోస్టుల భర్తీకి శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ నేతత్వంలోని ఎంపిక కమిటీ ఇంటర్వూ్యలు నిర్వహించి వీరిద్దరి పేర్లను ఖరారు చేసింది. కమిటీలో ఇంధనశాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, సింగరేణి సీఎండీ ఎన్‌.శ్రీధర్, కోలిండియా నుంచి శేఖర్‌ సరన్, కేంద్ర బొగ్గు శాఖ సెక్రటరీ పి.ఎస్‌.ఎల్‌.స్వామి ఉన్నారు. వీరారెడ్డి గతంలో అడ్రియాల లాంగ్‌ వాల్‌ జనరల్‌ మేనేజర్‌గా పనిచేశారు. డి.సత్యనారాయణ రావు ప్రస్తుతం భూగర్భ గనుల జనరల్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. డైరెక్టర్‌ (పి–పి) పోస్టులకు మొత్తం ఐదుగురు సీనియర్‌ జనరల్‌ మేనేజర్‌ హోదాలు కలిగిన వీరారెడ్డి, జి.వెంకటేశ్వరరెడ్డి, ఎస్‌.డి.ఎం. సుభానీ, కె.గురవయ్య, హబీబ్‌ హుస్సేన్‌లను, డెరైక్టర్‌ (ఎక్ట్రికల్‌–మెకానికల్‌) పోస్టులకు సీనియర్‌ జనరల్‌ మేనేజర్‌ హోదా కలిగిన డి.సత్యనారాయణ రావు, జి.ఎస్‌. రాంచంద్రమూర్తి, ఎం.నాగేశ్వర్‌ రావు, డి.వి.ఎస్‌.సూర్యనారాయణలను పిలిచారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు