Tomato Price In Hyderabad: కూరలు కుతకుత.. టమాటా ఒకటే అనుకుంటే పొరపాటే.. ఈ పట్టిక చూడండి

24 Nov, 2021 12:45 IST|Sakshi

మండుతున్న కూరగాయల ధరలు 

మార్కెట్లో టమాట కిలో రూ.100 పైమాటే.. 

రైతుబజార్లో కూడా అంతే.. 

ఆకాశాన్నంటుతున్న మిగతావాటి ధరలు  

Vegetable Prices List In Hyderabad: వంటగదిలోకి వెళ్లకమునుపే కూరగాయల ధరలు మంట పుట్టిస్తున్నాయి. నిన్నటి వరకు బయట మార్కెట్లోనే అనుకుంటే...ఇప్పుడు రైతుబజార్‌లో సైతం కూరగాయల  ధరలు అమాంతం పెరగడంతో సామాన్య, మధ్యతరగతి వర్గాలు కొనాలంటే ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్క టమాటా ధర నెల రోజుల క్రితం కిలో రూ.30 ఉంటే ప్రస్తుతం రూ.100కు చేరింది. అదే బాటలో బెండకాయ, వంకాయ, దొండ, చిక్కుడు, గోకరకాయ, క్యారెట్, బీన్స్‌...ఇలా దాదాపు అన్ని రకాల కూరగాయల ధరలు పెరగడంతో కిలో కొనేచోట అర, పావు కిలోతో సరిపెట్టుకుంటున్నారు. రైతుబజార్‌ ధరలే బెంబేలెత్తిస్తుంటే ఇక బయట ధరలు చూస్తే నోరెళ్లబెట్టాల్సిన పరిస్థితులే ఉన్నాయి.
(చదవండి: గిన్నిస్‌ బుక్‌లో రికార్డులు సృష్టిస్తున్న శ్రీ వాస్తవ.. ఇంతకీ ఏం చేస్తోంది)

Vegetable Prices In Hyderabad 

వర్షాలు బాగా కురిసినప్పటికీ..
నిన్న మొన్నటివరకు వర్షాలు బాగానే కురిసినప్పటికీ కూరగాయల ధరల దిగుబడి మాత్రం పెరగకపోవడంతో ధరలకు రెక్కాలొచ్చాయి. అంతేకాకుండా పక్క రాష్ట్రాల్లో నిన్నటి వరకు కురిసిన భారీ వరదలకు రోడ్లు దెబ్బతినటంతో కూరగాయల దిగుమతి తగ్గిపోయింది. వాహనాల రాకపోకలు లేకపోవటంతో  ధరలు పెరిగాయి. మండు వేసవిలో ఉన్న ధరల కంటే అధికంగా ఉండడం కలవరపాటుకు గురిచేస్తోంది. డిమాండ్‌కు, ఉత్పత్తికి మధ్య ఎనలేని వ్యత్యాసం ఉంటుండడంతో వ్యాపార వర్గాలు ధరలు  పెంచేసి విక్రయాలు జరుపుతున్నారు. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. భరత్‌నగర్‌ కాలనీ కూరగాయల మార్కెట్‌లో కూడా ధరలు అధికంగా ఉన్నాయి.  

Tomato Price In Hyderabad

కర్రీ పాయింట్లలో సైతం.. 
పెరిగిన కూరగాయల ధరలు, నిత్యావసర సరుకుల ధరల కారణంగా కర్రీ పాయింట్ల నిర్వాహకులు సైతం ధరలు పెంచేశారు. నిన్నటివరకు రూ.10– 12లుగా ఉన్న కనీస ధర (ఒక కర్రీ)ను రూ.20లకు పెంచేశారు. అయితే ఒక్కో ఏరియాలో ఒక్కో విధంగా ఉంది. మరోవైపు పెరిగిన కూరగాయల ధరలతో కొనడమే మానేసిన చాలా మంది కర్రీ పాయింట్లను ఆశ్రయించడంతో ఆయా సెంటర్లకు డిమాండ్‌ పెరిగింది. ఆదే అదునుగా నిర్వాహకులు కర్రీ పాయింట్లపై ఆధారపడ్డ యువత, బ్యాచ్‌లర్స్, కుటుంబాలపై సైతం అదనపు భారం వేస్తున్నారు.
(చదవండి: ముక్కలేనిదే ముద్ద దిగదు.. నీటుగా ఉండే ‘నాటు కోడి’ రుచి ఆస్వాదించాల్సిందే)

Vegetable Prices Hike News

ఎన్నడూ లేనంత ధరలు పలుకుతున్నాయి..
గతంలో ఎప్పుడూ లేనంతగా కూరగాయల ధరలు మండుతున్నాయి. అదీ, ఇదీ అని కాకుండా దాదాపు అన్ని కూరగాయల ధరలు పెరిగిపోయాయి. నెలవారీ బడ్జెట్‌పై అదనపు భారం తప్పడం లేదు. టమాట గతంలో 10 నుంచి 20 దాకా ఉండేది. ఒకేసారి 100కు చేరటం, మిగతా కూరగాయలు కూడా 60 రూపాయలు దాటి ఉండటం వినియోగదారుల నడ్డి విరుగుతోంది.  
– అనిత, మూసాపేట

గడిచిన నెలలో పెరిగిన కూరగాయల ధరలు, రైతుబజార్‌ ధరల ప్రకారం ఈ విధంగా ఉన్నాయి

మరిన్ని వార్తలు