ఈ బిల్లుతో అవినీతి అంతం

14 Oct, 2020 08:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా బదలాయించేందుకు అధికారులకున్న విచక్షణాధికారాల రద్దుతో అవినీతికి, అవకతవకలకు ఆస్కారం తగ్గి పూర్తి పారదర్శకత సాధ్యమవుతుందని శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ధరణి ద్వారా ఆన్‌లైన్‌ విధానంలో వ్యవసాయేతర భూముల బదలాయింపు దరఖాస్తు చేసుకునేలా నాలా చట్టాన్ని సవరించామని.. దీని ద్వారా రైతుకు, బిల్డ ర్‌కు ప్రయోజనం కలుగుతుందన్నారు. మంగళవారం తెలంగాణ అగ్రికల్చర్‌ ల్యాండ్‌ సవరణ బిల్లు (కన్వర్షన్‌ నా న్‌ అగ్రికల్చర్‌ ల్యాండ్‌)– 2020, ఇండియన్‌ స్టాంప్‌ (తెలం గాణ సవరణ) బిల్లు– 2020ను శాసనసభలో ప్రశాంత్‌రెడ్డి ప్రవేశపెట్టారు.

ఆయన మాట్లాడుతూ.. పాత చట్టంలో వ్య వసాయ భూమిని వ్యవసాయేతరగా మార్చే ప్రక్రియలో ఆర్డీఓకు కొన్ని విచక్షణాధికారాలు ఉండేవని, ఈ క్రమంలో కొంత అవినీతికి ఆస్కారం ఏర్పడిందన్నారు. ఈ సవరణ బిల్లుతో ఆర్డీఓ ఆ అధికారాన్ని కోల్పోతారని, ధరణి ద్వా రా ఆన్‌లైన్‌లో సత్వరమే ఈ ప్రక్రియ పూర్తవుతుందన్నా రు. ఇప్పటికే ఎవరైనా వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు ఉపయోగించుకుంటున్న వారు మూడు నెలల్లోగా దరఖాస్తు చేసుకుంటే ప్రస్తుతం విధిస్తున్న 50% జరిమానా ఉండదని వివరించారు. ఇక భూముల ప్రాథమిక విలువ నిర్ధారణకు సంబంధించి సబ్‌ రిజిస్ట్రార్లకు 47ఏ కింద విచక్షణాధికారాలను తొలగిస్తూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల చట్టానికి సవరణ చేసినట్టు తెలిపారు. ఈ బిల్లు ద్వారా రిజిస్ట్రేషన్, మ్యుటేషన్‌తోపాటు డాక్యుమెంట్‌లకు ఒకేరోజు పొందే అవకాశం ఉంటుందని వెల్లడించారు. 

సక్రమంగా ఉన్నాయో లేదో చూడాలి:
అధికార పక్ష సభ్యులు గొంగిడి సునీత, మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో పాటు కాంగ్రెస్‌ శాసనసభా పక్ష నేత భట్టి విక్రమార్క, ఎంఐఎం సభ్యుడు జాఫర్‌ హుస్సేన్‌ ఈ బిల్లులను స్వాగతించారు. చర్చ సందర్భంగా ఎల్‌ఆర్‌ఎస్‌ విషయాన్ని భట్టి లేవనెత్తే ప్రయత్నం చేయగా.. దీన్ని స్పీకర్, అధికార పక్ష సభ్యులు అడ్డుకున్నారు. ‘సవరణ బిల్లు’పై చర్చ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ధరణిలో పొందుపరిచిన భూముల వివరాలు సక్రమంగా లేకుంటే, వ్యవసాయ భూముల బదలాయింపు ప్రక్రియతో మరో కొత్త సమస్య వస్తుందన్నారు. ధరణిలో పొందుపరిచిన భూములన్నీ సక్రమంగా ఉన్నా యో లేదో ముందు చూడాలని.. లేదంటే గందరగోళం నెలకొంటుందన్నారు. దీనిపై స్పష్టత ఇస్తేనే బిల్లుకు మద్దతిస్తామని తెలిపారు. దీనికి మంత్రి స్పందిస్తూ.. ఇప్పటికే 1.48 కోట్ల ఎకరాల పట్టా భూముల వివరాలు ధరణిలో రికార్డయ్యాయని.. కోర్డుల్లో ఉన్నవి, ఇతర పంచాయితీల్లో ఉన్న భూములను వదిలేసి 95శాతం భూముల వివరాలను పొందుపరిచామని తెలిపారు. 

చదవండి: బుల్లెట్‌లా పంటలు

మరిన్ని వార్తలు