బాలు చిరస్మరణీయుడు

11 Jun, 2022 02:05 IST|Sakshi
జీవనగానం’ గ్రంథాన్ని ఆవిష్కరిస్తున్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. చిత్రంలో   ఎస్పీ శైలజ, ఎస్పీ చరణ్, కమల్‌ హాసన్, శాంతాబయోటెక్‌ సంస్థ ఫౌండర్‌ వరప్రసాద్‌రెడ్డి 

‘జీవనగానం’ గ్రంథావిష్కరణ సభలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

బంజారాహిల్స్‌: పాటల కార్యక్రమాల నిర్వహణ వెనుక పిల్లలను గాయకులుగా, ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు సినీగాయకుడు బాలసుబ్రమణ్యం పడిన తపన కనిపి స్తుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. హాసం సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్‌ పీఎస్‌ గోపాలకృష్ణ రచించిన ‘జీవనగానం’ గ్రంథాన్ని జూబ్లీహిల్స్‌లోని దస్‌పల్లా హోటల్‌లో శుక్రవారం ఆవిష్కరించారు.

సంజయ్‌కిశోర్‌ రూపొందించిన బాలు జీవన చిత్రం డాక్యుమెంటరీని, సినీనటుడు కమల్‌ హాసన్, హాసం సంస్థ, శాంతాబయోటెక్‌ సంస్థ ఫౌండర్‌ వరప్రసాద్‌రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. అనంతరం వెంకయ్యనాయుడు మాట్లా డుతూ.. బాలు స్ఫూర్తితో మన భాష, సంస్కృతి, కళలను భావితరాలకు సగర్వం గా అందించేందుకు ముందుకు రావాలని ఆకాంక్షించారు.

ఆలయ సుప్రభాత నివేద నల్లో, తెలుగు ప్రజల జీవితాల్లోనూ బాలు చిరస్మరణీయుడని కొనియాడారు.  బాలు జీవితం గురించి ముందు తరాలు తెలుసుకోవాలన్న తపనతో పుస్తకాన్ని తీసుకొచ్చిన పుస్తక రచయిత డా‘‘పి.ఎస్‌.గోపాలకృష్ణ, చిత్ర రూపకర్త సంజయ్‌ కిశోర్,  ప్రచురణకర్త డా.వర ప్రసాద్‌ రెడ్డిలను, హాసం సంస్థను ఆయన అభినందించారు. పుస్తకాన్ని ఆవిష్కరించడం, వారికి ఆత్మీయులైన కమల్‌ హాసన్‌కి తొలిప్రతిని అందజేయడం ఆనందంగా ఉందన్నారు. కమల్‌హాసన్‌ మాట్లాడుతూ  తమ ఇద్దరి ఆత్మ ఒకటేనన్నారు. 

మరిన్ని వార్తలు