ప్రైవేటు డెయిరీలతో పోటీపడుతూ విజయ డెయిరీ పాల ధర పెంపు!

21 Aug, 2022 03:02 IST|Sakshi

పాల ధరతోపాటు సేకరణ ధరనూ పెంచే అవకాశం

రేపటి బోర్డు సమావేశంలో నిర్ణయం 

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు డెయిరీలతో పోటీపడుతూ విజయ డెయిరీ కూడా పాల ధరలను పెంచనుంది! సోమవారం జరిగే బోర్డు సమావేశంలో పాల ధరతోపాటు పాల సేకరణ ధరను కూడా పెంచే అవకాశాలున్నాయి. ఈ మేరకు బోర్డు ఇప్పటికే సూత్రప్రాయ నిర్ణయం తీసుకుందని, బోర్డు సమావేశంలో చర్చించాక తుది నిర్ణయం ప్రకటిస్తామని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. బోర్డు భేటీకి హాజరుకావాలని జిల్లాకో రైతు చొప్పున ఆహ్వానం కూడా పంపినట్లు ఆయన తెలిపారు.

ఈ సమావేశంలో పాడి రైతుకు లీటర్‌కు రూ. 4 ప్రోత్సాహకం కింద ఇవ్వాల్సిన బకాయిల గురించి కూడా చర్చించనున్నారు. పాడి రైతుకు లీటర్‌ సేకరణ ధరను కనీసం రూ. 60 చేయాలని పాడి రైతుల సంఘం కోరుతోంది. ఈ మేరకు రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను శనివారం కలిసిన సంఘం నేతలు పలు అంశాలతో కూడిన వినతిపత్రం అందజేశారు. కానీ ప్రస్తుతం వెన్న శాతం ఆధారంగా ఇస్తున్న ధరకు రూ. 2–3 వరకు సేకరణ ధర పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు లీటర్‌ పాల ధర కూడా పెరగనుంది.



(నోట్‌: 5 శాతం తర్వాత ప్రతి పాయింట్‌కు సేకరణ ధర మారుతుంది. ఈ ధరతోపాటు ప్రోత్సాహకం కింద ప్రతి లీటర్‌కు రూ. 4 చొప్పున ప్రోత్సాహకం ఇవ్వనున్నారు. అయితే రాష్ట్రంలో వెన్న శాతం గరిష్టంగా 8కన్నా మించదని పాడి రైతులు చెబుతున్నారు.)
చదవండి: బీజేపీకి ఓటేస్తే.. మోటార్లకు మీటర్లే  

మరిన్ని వార్తలు