Photo Feature: బతుకమ్మ చీరలను మూటలు కట్టేందుకు వాడుతున్న మహిళలు

2 Oct, 2022 14:03 IST|Sakshi
ధారూరు సంతలో బతుకమ్మ చీరలు

ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బతుకమ్మ చీరలను లబ్ధిదారులు వివిధ పనుల కోసం వినియోగిస్తున్నారు. కొంతమంది పంట పొలాల్లోకి అడవి పందులు రాకుండా చేల చుట్టూ కడుతుండగా.. మరికొందరు మూటలు కట్టేందుకు వాడుతున్నారు. శనివారం ధారూరు సంతకు వచ్చిన ఓ మహిళా రైతు బతుకమ్మ చీరల్లో ఆకు కూరలు మూట కట్టి తీసుకువచ్చింది. ఇదేమని ప్రశ్నించగా.. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పాలిస్టర్‌ చీరలు కట్టుకునేలా లేవని, మూడేళ్లుగా వీటిని పొలం వద్ద బెదుర్లు పెట్టేందుకే వినియోగిస్తున్నామని తెలిపారు.   
– ధారూరు (వికారాబాద్‌)
 

మరిన్ని వార్తలు