తోటకు కంచెగా బతుకమ్మ చీరలు

12 Oct, 2020 08:47 IST|Sakshi

తంగళ్లపల్లి (సిరిసిల్ల): తెలంగాణ ఆడపడుచులకు రాష్ట్ర ప్రభుత్వం కానుకగా అందిస్తున్న బతుకమ్మ చీరలు ఓ గ్రామంలో తోటకు కంచెగా మారాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని గండిలచ్చపేట గ్రామంలో ఓ వ్యక్తి తమ ఇంటి వద్ద తోటను పశువులు పాడుచేయకుండా ఉండడానికి బతుకమ్మ చీరలను కంచెగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇదేంటని ప్రశ్నించగా, గత ఏడాది వచ్చిన బతుకమ్మ చీరలు కట్టుకోకుండా అలాగే ఉంచి ఇలా ఉపయోగించినట్లు తెలిపాడు. 

కాగా నేత కార్మికులకు ఉపాధి కల్పించడం, మహిళలకు పండుగ కానుక అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ‘బతుకమ్మ చీరలు’పంపిణీ కార్యక్రమం శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. ఈ నెల 17న మొదలయ్యే బతుకమ్మ పండుగను దృష్టిలో చీరల పంపిణీని చేస్తున్నారు. ఈ ఏడాది కోటి చీరలు పంపిణీ చేయాలనే లక్ష్యంతో ఆయా జిల్లాలకు 98.5 లక్షల చీరలను చేరవేశారు. జిల్లాలలో బతుకమ్మ చీరల పంపిణీ కొనసాగుతోంది.

మరిన్ని వార్తలు