అది ఫేక్‌ వీడియో: కేసులు పెడతాం!

21 Nov, 2020 16:13 IST|Sakshi
వీడియో దృశ్యం

ఆసిఫాబాద్‌ జిల్లా : నిన్న బెజ్జూర్‌ మండలంలోని అంబగట్ట అటవి ప్రాంతంలో రైతులకు కనపడిన పెద్ద పులి అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది ఫేక్ వీడియో అని ఎఫ్‌డీఓ విజయ్‌ కుమార్‌ తెలిపారు. ఆ వీడియో మహారాష్ట్రకు చెందిన యవాత్మల్ జిల్లా, అంజనీ వాడకు సంబంధించినదని పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  ‘‘ దహెగాం మండలం, దిగిడ గ్రామంలో దాడి చేసిన పులి మహారాష్ట్రకు వెళ్లినట్లు గుర్తించాం. ఎక్కడా కెమెరాలకు పులి చిక్కలేదు. ( అదిగో పెద్దపులి.. చచ్చాంరా దేవుడో! )

ప్రస్తుతం ఉన్న 30 మంది టీంతో సెర్చ్ ఆపరేషన్ మరోవారం పొడిగించాము. యువత తప్పుడు వీడియో తప్పుడు సమాచారం ఇచ్చినట్లు దృష్టికి వస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాము. పులిని బంధించడానికి రెండు బోనులు ఏర్పాటు చేశాం. 30 కెమెరాలతో బెజ్జూర్‌ పెంచికల్ పేట్ దహెగాం మండలాల్లో గట్టి నిఘా కొనసాగుతుంది.

>
మరిన్ని వార్తలు