ఛాంపియన్స్‌ ఆఫ్‌ లెర్నింగ్‌గా వర్చ్యుసా...

22 Feb, 2021 20:21 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: శరవేగంగా అన్ని లావాదేవీలూ డిజిటల్‌ మయంగా మారిపోతున్న పరిస్థితుల్లో... సంబంధిత అంశాలపై శిక్షణా అవగాహన తరగతులు కూడా ఊపందుకున్నాయి. ఔత్సాహికుల కోసం నిర్వహిస్తున్న ఈ తరహా కార్యక్రమాల్లోనూ పోటీ పెరిగింది. అదే క్రమంలో అలాంటి వాటిలో ఉత్తమమైన వాటిని గుర్తించడమూ ప్రాధాన్యత కలిగిన అంశమైంది. ఈ తరహా సేవలు అందిస్తున్న సంస్థల శిక్షణా సామర్ధ్యానికి గుర్తింపునిచ్చే  పురస్కారాలూ షురూ అయ్యాయి.

అదే క్రమంలో ఐటి, సొల్యూషన్స్, డిజిటల్‌ వినియోగంలో అవసరమైన సేవలు, అందించే వర్చ్యుసా కార్పొరేషన్‌... ఛాంపియన్‌ ఆఫ్‌ లెర్నింగ్‌ గుర్తింపును సాధించింది. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధులు తెలిపారు. అసోసియేషన్‌ ఫర్‌ టాలెంట్‌ డెవలప్‌మెంట్‌ (ఎటిడి) నుంచి వర్చ్యుసా ఈ గుర్తింపును అందుకుంది.

3500 మంది 7500 గంటలు...
లెర్నర్స్‌వీక్‌..విశేషాలివీ...

గత డిసెంబరు 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకూ ఈ లెర్నర్స్‌ వీక్‌ నిర్వహించారు. వరుసగా నాలుగో ఏడాది ఈ గుర్తింపును తమ సంస్థ దక్కించుకుందని తమ సంస్థ నిర్వహిస్తున్న లెర్నర్స్‌ వీక్‌ వంటి వార్షిక కార్యక్రమాలతో పాటు, ఈ ఏడాది అందించిన 240కిపైగా కోర్సులు వంటివి ఈ గుర్తింపునకు అర్హత సాధించిపెట్టాయని సంస్థ ప్రతినిధులు అంటున్నారు. ఈ ఏడాది టెక్నికల్, ప్రాసెస్, డొమైన్, బిహేవియరల్, కమ్యూనికేషన్‌ డిసిప్లైన్స్‌... తదితర అంశాలను తాము అందించామన్నారు. ఈ కార్యక్రమానికి దాదాపుగా 3,500కిపైగా అభ్యర్ధులు లాగిన్‌ అయ్యారని, 7,500 గంటలకు పైగా శిక్షణ కొనసాగిందని వివరించారు. సెల్ఫ్‌ ఎన్‌హాన్స్‌మెంట్, ఆడియోబుక్స్, వెబ్‌–సిరీస్,  హ్యాండ్స్‌ ఆన్‌ అప్లికేషన్‌ సిమ్యులేషన్స్, డెవ్‌ఓప్స్, డేటా అనలిటిక్స్‌ వంటివి ఇందులో భాగంగా ఉన్నాయన్నారు.

మరిన్ని వార్తలు