అన్ని రంగాల్లో సత్తాచాటుతున్న మహిళలు

21 Mar, 2022 12:39 IST|Sakshi

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రాధారాణి

సాక్షి, హైదరాబాద్‌: నేటి మహిళలు అన్ని రంగాల్లో ప్రతిభ కనబరుస్తూ పురుషులతో సమానంగా ముందుకు వెళ్తున్నారని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జి.రాధారాణి అన్నారు. ఆదివారం బంజారాహిల్స్‌లోని ప్రసాద్‌ ల్యాబ్స్‌లో విశ్వగురు వరల్డ్‌ రికార్డ్స్‌ ఆధ్వర్యంలో వివిధ రంగాలలో ఉత్తమ సేవలు అందిస్తున్న మహిళలకు క్వీన్‌ అఫ్‌ ది నేషనల్‌ అవార్డ్స్‌ ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్‌  రాధారాణి మహిళలను సన్మానించి ప్రసంగించారు.

విశ్రాంత ఐఏఎస్‌ అధికారి లక్ష్మీకాంతం, విశ్రాంత ఐపీఎస్‌ అధికారి డాక్టర్‌ గోపీనాథ్‌రెడ్డి మాట్లాడుతూ... మహిళలకు ఓర్పు సహనంతో పాటు ఏకాగ్రత అంకితభావం అమితంగా ఉంటాయన్నారు. అవి వారికి దేవుడు ఇచ్చిన వరాలని అన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ఉత్తమ సేవలు అందించిన 33 మంది మహిళలను వారు ఘనంగా సన్మానించారు. సంస్థ వ్యవస్థాపకుడు, కార్యనిర్వాకులు సత్యవోలు రాంబాబు, డైరెక్టర్‌ సత్యవోలు పూజిత, సలహాదారు సుందరపల్లి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. (క్లిక్‌.. జైపూర్‌ లిటరేచర్‌ ఫెస్టివల్‌ 2022: ఆ మహిళలవి ప్రాణాలు కావా!!)

కార్యక్రమంలో భాగంగా సత్యవోలు రాంబాబు తన ప్రతిభను ప్రదర్శించారు. ముక్కుతో బొమ్మ గీసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. 

మరిన్ని వార్తలు