ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షుడిగా సాను 

17 Dec, 2022 11:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) జాతీయ అధ్యక్షుడిగా వీపీ సాను, ప్రధాన కార్యదర్శిగా మయూక్‌ బిశ్వాస్‌ తిరిగి ఎన్నికయ్యారు. మొత్తం 83 మందితో కొత్త కమిటీ ఎన్నిక కాగా, వారిలో 19 మందితో కార్యదర్శి వర్గం (ఆఫీస్‌ బేరర్స్‌) ఎన్నికైంది. జాతీయ కమిటీలో తెలంగాణ నుంచి ఐదుగురికి, ఏపీ నుంచి నలుగురికి అవకాశం వచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్‌ ఆడిటోరియంలో మంగళవారం ప్రారంభమైన ఎస్‌ఎఫ్‌ఐ 17వ జాతీయ మహాసభలు, శుక్రవారం ముగిశాయి.

ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ నేషనల్‌ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఉపాధ్యక్షుడు, ప్రెసిడెంట్లుగా నితీశ్‌ నారాయణ్‌ (ఢిల్లీ సెంటర్‌), ప్రతికుర్‌ రహమన్‌ (బెంగాల్‌), తాళ్ల నాగరాజు (తెలంగాణ), అశోక్‌ (ఏపీ), అనుశ్రీ (కేరళ), సంగీతాదాస్‌ (అసోం), సహాయ కార్యదర్శులుగా దినిత్‌ డెంట, దీప్సితాధర్‌ (ఢిల్లీ సెంటర్‌), శ్రీజన్‌ భట్టాచర్య (బెంగాల్‌), పీఎం అశ్రో (కేరళ), సందీపన్‌ దాస్‌ (త్రిపుర), ఆదర్శ్‌ ఎం.సాజీ (సెంటర్‌) ఎన్నికయ్యారు.

కార్యదర్శి వర్గ సభ్యులుగా నిరుబన్‌ చక్రవర్తి (తమిళనాడు), ఐషీఘోష్‌ (ఢిల్లీ), సుభాష్‌ జక్కర్‌ (రాజస్థాన్‌), అమత్‌ ఠాకూర్‌ (హిమాచల్‌ప్రదేశ్‌)ను ఎన్నుకున్నారు. తెలంగాణ నుంచి నాగరాజు, ఆర్‌.ఎల్‌.మూర్తి, ఎం.పూజ, మమత, శివదుర్గారావు (హెచ్‌సీయూ)లకు కమిటీలో చోటు లభించింది.

(చదవండి: ఇప్పుడేం చేద్దాం? ఢిల్లీ వెళ్లాలా? లేఖ రాయాలా)

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు